జగన్‌తో సంక్షేమ విప్లవం
పేదల అభ్యున్నతి కోసం మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అండగా నిలిచారు. సచివాలయాలు ఏర్పాటు చేసి వాలంటరీ వ్యవస్థ ద్వారా ప్రభుత్వం అందించే అన్ని సంక్షేమ పథకాలను నేరుగా ప్రజలకు చేర్చిన ఘనత వైఎస్ జగన్‌కే దక్కుతుంది. నాడు – నేడు ద్వారా విద్య, వైద్య రంగాల్లో పెనుమార్పులు తీసుకొచ్చి దేశం మన రాష్ట్రం వైపు చూసేలా అభివృద్ధి చేశారు. ప్రస్తుత టీడీపీ ప్రభు త్వం సూపర్ సిక్స్ పేరుతో ప్రజలను రెండేళ్ల నుంచి వంచిస్తోంది. పంటలకు గిట్టుమాటు ధరలు లేక రోడ్లపై పడేయాల్సిన పరిస్థితి నెలకొంది. నేడు జగనన్న జన్మదినం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా కేక్ కటింగ్‌లు, ర్యాలీలు, సేవా కార్యక్రమాలు చేపట్టాం. – కాటసాని రాంభూపాల్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు


