జగనన్న పాలన స్వర్ణయుగం
జిల్లాలో రైతుల పరిస్థితి అధ్వానంగా మారింది. ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు. ఎక్కడా కొనుగోలు కేంద్రాలు కనిపించడం లేదు. ఇటీవల తుపాన్‌తో దెబ్బతిన్న మహానంది మండలం అల్లినగరం అరటి రైతు బాల వెంకటరెడ్డిని కదిలిస్తే కన్నీళ్లు పెట్టాడు. కొన్నేళ్లుగా అరటి సాగు చేసినా ఎన్నడూ ఇంతలా నష్టపోలేదని చెప్పుకొచ్చాడు. ‘2023లో భారీ వర్షాలు కురవడంతో చెట్లన్నీ నేలకొరిగాయి. జగనన్న ప్రభుత్వం స్పందించి ఎకరాకు రూ.10 వేల చొప్పున పరిహారం అందించింది. గత ప్రభుత్వంలో గెల రూ.360 చొప్పున అమ్మితే ప్రస్తుతం గెల రూ.70 ధర పలుకుతోంది. దీంతో లక్షలాది రూపాయలు నష్టపోయాం. ఎకరాకు రూ.70 వేల వరకు నష్టాన్ని మూటగట్టుకున్నాం. అరటి గెల తెంచి అమ్మినా కూడా కూలీల ఖర్చులు కూడా గిట్టుబాటు కావడం లేదు. జగనన్న పాలన రైతులకు ఓ స్వర్ణయుగం. ప్రస్తుత చంద్రన్న ప్రభుత్వంలో రైతు కూలీగా మారే ధీన స్థితికి చేరుకున్నాడు. రైతన్నలను ఆ భగవంతుడే కాపాడాలి’.
– ఆత్మకూరు


