కరువును తరిమి..
దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి రాయలసీమ రైతుల సంక్షే మం కోసం పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 15 వేల నుంచి 44 వేల క్యూసెక్కులకు పెంచుతూ పదిగేట్లతో నూతన హెడ్‌రెగ్యులేటర్‌ను నిర్మించారు. తండ్రి బాటలో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కూడా రాయలసీమలో కరువును తరిమేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే 44 వేల నుంచి 80 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసుకునేలా సంకల్పించారు. అందుకనుగుణంగా రూ.1,300 కోట్లతో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి బానకచర్ల వరకు 16.5కిలో మీటర్ల మేర ఎస్సారెమ్సీ కాల్వ లైనింగ్ పనులు, 9కిలో మీటర్ల మేర ఎస్సారెమ్సీ కాల్వ సేఫ్టీవాల్ నిర్మాణం చేపట్టారు. ఎస్సారెమ్సీ లైనింగ్ పనులతో పాటు బానకచర్ల వద్ద ఎస్సార్బీసీ కాల్వపై నూతన హెడ్‌రెగ్యులేటర్ పూర్తయితే 80 వేల క్యూసెక్కుల నీటి విడుదలకు మార్గం సుగమనం అవుతుంది. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పుణ్యమా అంటూ రాయలసీమ లోని పలు సాగునీటి ప్రాజెక్టుల ఆయకట్టు రైతులు రెండు కార్ల పంటలు సాగు చేస్తున్నారు.
–జూపాడుబంగ్లా


