భక్తిశ్రద్ధలతో తిరుప్పావడ సేవ
నంద్యాల (వ్యవసాయం): స్థానిక సంజీనగర్ రామాలయంలో వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామికి గురువారం ధనుర్మాసం సందర్భంగా శ్రీ భగవత్ సేవా సమాజ్ ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో తిరుప్పావడ సేవ కార్యక్రమం నిర్వహించారు. ఉదయం స్వామివారి మూల విరాట్‌కు పంచామృత అభిషేకం, సహస్రనామార్చన పూజలు చేశారు. స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించారు. పులిహోరను స్వామి ముందు రాశిగా పోసి శ్రీవారి ప్రతిబింభంగా తీర్చిదిద్ది, అప్పం, జిలేబీ, మినప వడలు, కూరగాయలు, ఫలాలతో సుందరంగా అలంకరించి, వేద మంత్రాలతో నివేదన ఇచ్చారు. అనంతరం స్వామివారికి మహామంగళ హారతులిచ్చి తీర్థ ప్రసాదాలను భక్తులకు అందజేశారు. మధుర వాగ్వసంత డాక్టర్ దీవి హయగ్రీవచార్యులు తిరుప్పావడ సేవ విశిష్టతను భక్తులకు వివరించారు. కార్యక్రమంలో శ్రీకాంత్‌శర్మ, నటరాజ్ శర్మ, సముద్రాల సూరయ్య, శ్రీనివాసులు, మధుసూదన్, తదితరులు పాల్గొన్నారు.


