విద్యార్థిని చితకబాదిన టీచర్
జూపాడుబంగ్లా: కస్తూర్బా పాఠశాలలో తెలుగు టీచర్ ఇందిర బెత్తంతో ఏడో తరగతి విద్యార్థిని హరిణీశ్రీని చితకబాదారు. విద్యార్థి ని తండ్రి సంతోష్‌కుమార్‌శర్మ గురువారం కుమార్తెను చూసేందుకు పాఠశాల వద్దకు వెళ్లగా విషయం తెలిసింది. వెంటనే ఆయన పాఠశాల ఎస్‌ఓ యశోద దృష్టికి విషయాన్ని తీసుకెళ్లాడు. తాను పాఠశాలలో లేనని ఆమె తెలపటంతో తన బిడ్డను కొట్టిన తెలుగు టీచర్ ఇందిరకు ఫోన్‌చేసి నిలదీశారు. ఆమె పొంతనలేని సమాధానం చెప్పారని విద్యార్థిని తండ్రి సంతోష్‌కుమార్ శర్మ విలేకరుల ఎదుట వాపోయాడు. ఏడో తరగతి చదువుతున్న తన బిడ్డను ఎందుకు కొట్టాల్సి వచ్చిందన్న విషయం తనకు తెలియజేకుండా పాఠశాల ఎస్‌ఓ, తెలుగు టీచర్ ఇందిర నిర్లక్ష్యం చేశారన్నారు. టీచర్‌పై పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.
జాతీయ స్థాయి కబడ్డీ శిక్షణకు ఇద్దరు ఎంపిక
నంద్యాల(న్యూటౌన్): జాతీయ స్థాయి కబడ్డీ కోచింగ్ క్యాంపునకు బనగానపల్లెకు చెందిన హసీనా, ఎస్‌వీఆర్ కాలేజీ విద్యార్థిని అంకిత ఎంపికై నట్లు నంద్యాల జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు చింతలమోహన్‌రావు, కార్యదర్శి ఎం.సుబ్రమణ్యంలు గురువారం తెలిపారు. ఈనెల 25 నుంచి 28 వరకు బెంగాల్‌లో జరిగే జాతీయ స్థాయి కబడ్డీ పోటీల్లో భాగంగా వైజాగ్‌లోని గాజువాకలో కోచింగ్ క్యాంపును నిర్వహిస్తున్నారు. 20 మంది శిక్షణకు ఎంపిక కాగా.. వారిలో ప్రతిభ చూపిన 14 మందిని జాతీయ జట్టుకు ఎంపిక చేసే అవకాశం ఉంటుందన్నారు.
ఆవేదనకు లోనైన తల్లిదండ్రులు
విద్యార్థిని చితకబాదిన టీచర్


