బాలికల హైస్కూల్‌లో చాక్లెట్ల కలకలం
● టీచర్‌కు, విద్యార్థినులకు అస్వస్థత ● విచారణ జరిపిన సీఐలు
నందికొట్కూరు: పట్టణంలోని ప్రభుత్వ బాలికల హైస్కూల్‌లో చాక్లెట్ కలకలం రేపింది. మంగళవారం బాలికల హైస్కూల్‌లో ఒక టీచర్‌కు విద్యార్థినులు చాక్లెట్ ఇచ్చారు. బాలికలు ఇచ్చిన చాక్లెట్ తినడంతో టీచర్‌కు సాయంత్రం ఇంటి వద్ద వాంతులు కావడం, కళ్లు తిరిగాయి. గురువారం కొందరు విద్యార్థినులు అదే చాక్లెట్ తినడంతో కడుపు నొప్పి రావడం, కళ్లు తిరగడం వంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ విషయంపై ఇన్‌చార్జ్ హెచ్‌ఎం ఖాజా హుసేన్ తల్లిదండ్రులకు సమాచారం అందించారు. పిల్లలను తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య చికిత్సలు చేయించారు. ఈ విషయం తెలుసుకున్న టౌన్ సీఐ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి అక్కడికి చేరుకొని విచారణ చేపట్టారు. స్కూల్‌లో తినుబండరాలు, చాక్లెట్లు విచ్చలవిడిగా విక్రయిస్తున్నా ఎందుకు చర్యలు చేపట్టలేదని ఎంఈఓ రామిరెడ్డిపై టౌన్ సీఐ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలలపై విద్యాశాఖ అధికారులు ప్రత్యేక నిఘా ఉంచాలని సూచించారు. తహసీల్దార్ శ్రీనివాసులు మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. బాలికల హైస్కూల్‌కు రూరల్ సీఐ సుబ్రమణ్యం చేరుకుని వివరాలను తెలుసుకున్నారు.


