నేడు శ్రీశైలం రానున్న భారత ప్రధాన ఎన్నికల కమిషనర్
శ్రీశైలం టెంపుల్: శ్రీ భ్రమరాంబా మల్లికార్జున స్వామి దర్శనార్థం భారత ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) జ్ఞానేష్ కుమార్ శుక్రవారం శ్రీశైలం రానున్నారు. సాయంత్రం శ్రీశైలం చేరుకుని రాత్రి బస చేసి, శనివారం ఉదయం మల్లికార్జున స్వామికి అభిషేకం, భ్రమరాంబాదేవికి కుంకుమార్చన తదితర ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.
చౌడేశ్వరిదేవి దీక్ష విరమణ
బనగానపల్లె రూరల్: నందవరం గ్రామంలోని శ్రీ చౌడేశ్వరిదేవి ఆలయంలో చౌడేశ్వరిదేవి దీక్షను 200 మంది భక్తులు గురువారం విరమించారు. ఇరుముడులతో అమ్మవారి భక్తిగీతాలు పాడుతూ అమ్మవారి ఆలయానికి వచ్చారు. ఆలయలో ఆవరణలో పూర్ణాహుతి అనంతరం మాలధారులు తమ దీక్షను విరమించారు. భక్తులకు దేవస్థానం తరఫున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆలయ పాలక మండలి చైర్మన్ పీవీ కుమార్‌రెడ్డి, ఆలయ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.
హోటళ్లు,
సూపర్ మార్కెట్ల తనిఖీ
నంద్యాల(వ్యవసాయం): జాతీయ వినియోగదారుల వారోత్సవాల్లో భాగంగా గురువారం నంద్యాలలోని హోటళ్లు, సూపర్‌మార్కెట్లను ఫుడ్‌సేఫ్టీ అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. వినియోగదారులకు నాణ్యమైన, నమ్మకమైన ఆహార పదార్థాలను అందించాలన్నారు. కొన్ని నమూనాలను సేకరించి హైదరాబాద్‌లోని ఫుడ్ ల్యాబొరేటరీకి పంపారు. ఫుడ్‌సేఫ్టీ అధికారి వెంకటరాముడు, తూనికల కొలతల అధికారి అనిత, జిల్లా వినియోగదారుల రక్షణ మండలి అధ్యక్షుడు అమీర్‌బాషా తదితరులు పాల్గొన్నారు.
‘టెట్’ వద్దంటూ
ఉపాధ్యాయుల ధర్నా
నంద్యాల(న్యూటౌన్): ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ (టీచర్ ఎజిబిలిటీ టెస్ట్) వద్దంటూ కలెక్టరేట్ ఎదుట గురువారం ధర్నా నిర్వ హించారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు పీవీ ప్రసాద్, జిల్లా గౌరవాధ్యక్షుడు సుబ్బరాయుడు మాట్లాడారు. 2010కి ముందు నియామకమైన ఉపాధ్యాయులు టెట్ ఉత్తీర్ణత కావాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందన్నా రు. ఈ తీర్పులో సడలింపు కోసం రాష్ట్ర ప్రభు త్వం సుప్రీంకోర్టులో రివ్యూ పిటీషన్ వేయాల ని డిమాండ్ చేశారు.ఉపాధ్యాయులను స్వేచ్ఛాయుత వాతావరణంలో బోధన చేసేటట్లు చర్యలు తీసుకోవాలన్నారు. యూటీఎఫ్ నాయ కులు కిశోర్, రామ్మోహన్, రామకృష్ణుడు, షమీమ్‌భాను, చెన్నమ్మ, ముర్తుజా,వలి, కాశీం, నరసింహారెడ్డి, అరవింద్ పాల్గొన్నారు.
రేపటి నుంచి డోర్ డెలివరీ ప్రచార మాసోత్సవాలు
కర్నూలు సిటీ: ఏపీఎస్ ఆర్టీసీ ఆధ్వర్యంలో రేపటి(శనివారం) నుంచి డోర్ డెలివరీ ప్రచార మాసోత్సవాలు నిర్వహించనున్నట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి టి.శ్రీనివాసులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలకు మరింత సౌకర్యవంతమైన సేవలు అందించడంలో భాగంగా ఆర్టీసీలో పార్సిల్స్ ఇంటి వద్దకే చేరవేస్తామన్నారు. జిల్లా పరిధిలోని అన్ని ఆర్టీసీ బస్టాండ్ల కార్గో కౌంటర్ల ద్వారా రాష్ట్రంలోని 87 ముఖ్య పట్టణాలకు 50 కేజీల వరకు 10 కి.మీ పరిధిలో పార్సిల్స్ బుక్ చేసి త్వరితగతిన డోర్ డెలివరీ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
నేడు శ్రీశైలం రానున్న భారత ప్రధాన ఎన్నికల కమిషనర్
నేడు శ్రీశైలం రానున్న భారత ప్రధాన ఎన్నికల కమిషనర్


