శ్రీశైలంలో జూదం, మద్యం నిషేధం
శ్రీశైలంటెంపుల్: శ్రీశైలంలో జూదం ఆడకూడదని, మద్యం తాగకూడదని, మాంసం తినకూడదని.. ఇవన్నీ నిషేధమని దేవస్థాన కార్యనిర్వహణాధికారిఎం.శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఏపీ దేవదాయ చట్టాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలని సూచించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. దేవదాయ ధర్మదాయ శాఖ చట్టం 1987 ప్రకారం శ్రీశైల క్షేత్ర పరిధిలో ప్రత్యక్షంగా, పరోక్షంగా అన్యమత ప్రార్థనలు, ప్రచారాలు చేయకూడదన్నారు. అలాగే క్షేత్ర పరిధిలో, ఆలయ పరిసర ప్రాంతాల్లో దేవస్థాన అనుమతి లేకుండా వీడియోలు తీసి, డ్రోన్‌తో చిత్రీకరించి సోషల్ మీడియాలో ప్రచారం చేయడం నేరమన్నారు. భక్తులు దేవస్థాన నియమాలు పాటిస్తూ సహకరించాలన్నారు.


