చాలా బాధగా ఉంది
ఆరబోసిన ధాన్యం వరదలో కొట్టుకుపోవడం చాలా బాధగా ఉంది. నేను ఆరు ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశా. దిగుబడి తక్కువగానే వచ్చింది. కనీసం రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల దాకా పంట దిగుబడి ఆదాయం వస్తుందని భావించాను. మా కష్టం నీటిపాలు అయ్యింది. ప్రభుత్వం మాలాంటి రైతులను ఆదుకుని న్యాయం చేయాలి.
– రాజేంద్రప్రసాద్, ఆత్మకూరు
మార్కెట్‌యార్డులో ధాన్యాన్ని నిల్వ ఉంచితే తడవదని భావించాం. వ్యాపారులు రావడంతో 60 క్వింటాళ్ల ధాన్యాన్ని కాటా వేసి ఉంచాం. ఊహించని విధంగా గోడౌన్‌లో దాచుకున్న ధాన్యమంతా తడిచింది. ఈ ధాన్యాన్ని కొనే నాథుడే లేడు. ఆరబోసేందుకు అవకాశం లేకుండా పోయింది. అధికారులు స్పందించి మమ్మల్ని ఆదుకోవాలి.
– భాస్కర్‌రెడ్డి, ఆత్మకూరు
మాకు కన్నీళ్లు తప్ప ఏమీ మిగల్లేదు. మూడు ఎకరాల్లో మొక్కజొన్న పంటను సాగుచేసి సంబరపడ్డాను. పెట్టుబడి పోయి అంతోఇంతో వస్తుందని భావించాను. అయితే పంట ఇలా వరదపాలవుతుందని ఊహించలేదు. అప్పులను మూటగట్టుకునే పరిస్థితి నెలకొంది. మాలాంటి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి.
– సాంబశివుడు, క్రిష్ణాపురం
చాలా బాధగా ఉంది
చాలా బాధగా ఉంది


