ప్రామాణికంగా పంట నష్టం అంచనా
● జిల్లా కలెక్టర్ రాజకుమారి
రుద్రవరం: వర్షాల కారణంగా పంటలు దెబ్బతిన్నాయని, వెంటనే నష్టం అంచనా ప్రక్రియను ప్రామాణికంగా చేపట్టాలని అధికారులను ఆదేశించినట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి తెలిపారు. రుద్రవరం మండలం ఆలమూరులో మోంథా తుపానుతో దెబ్బతిన్న వరి, మొక్కజొ న్న, బొప్పాయి పంటలను ఆమె బుధవారం పరిశీలించారు. రైతులతో మాట్లాడారు. ఇప్పటికే మొక్కజొన్న 30శాతం కోత పూర్తి అయ్యిందని, మిగిలిన 70శాతం దెబ్బతినే అవకాశ ముందని అంచనా వేశామన్నారు. నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని, క్షేత్ర స్థాయికి వచ్చిన అధికారులకు సహకరించాలని జిల్లా కలెక్టర్ సూచించారు.


