 
															అవసరమైతే తప్ప బయటికి రావద్దు
నంద్యాల: తుఫాన్ ప్రభావం వలన ఆరెంజ్ అలర్ట్ ఇచ్చిన నేపథ్యంలో ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దని ప్రయాణాలు చేయవద్దని జిల్లా ఎస్పీ సునీల్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. జాతీయ రహదారులలో ప్రయాణించే భారీ వాహనాలను రాత్రి 7 గంటల నుంచి సురక్షితమైన ప్రాంతాల్లో నిలుపుకోవాలని, రాత్రి వేళ ప్రయాణాలు చేయరాదన్నారు. ఏదైనా కాలువలు, వాగులు, వంకలు, నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహించినా, వరదలు వచ్చే అవకాశం ఉన్నా వెంటనే పోలీసు, రెవెన్యూ అధికారులు సమాచారం తెలియజేయాలన్నారు. తుపాన్ ప్రభావం విద్యుత్ అంతరాయం, ఇళ్లల్లోకి నీరు చేరడం, చెట్లు, విద్యుత్ స్తంభాలు వైర్లు తెగిపోవడం, ఎవరైనా ప్రమాదంలో ఉన్న పోలీస్ టోల్ ఫ్రీ నెంబర్ 112కు కాల్ చేయాలన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
