 
															పోలీసు అమరవీరుల త్యాగాలు స్మరించుకుందాం
నంద్యాల: పోలీసు అమరవీరుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని ఎస్పీ సునీల్ షెరాన్ అన్నా రు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా సోమవారం జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణలో ఓపెన్ హౌస్ పేరుతో పోలీసు ఆయుధాల ప్రదర్శనను ఎస్పీ ప్రారంభించారు. పోలీసులు విధి నిర్వహణలో ఉపయోగించే ఆయుధాలు, వాటి పనితీరు, పరికరాలు, సాంకేతిక సాధనలను గురించి విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పోలీసుల విధులు, వారు వాడే ఆయుధాలు, పరికరాలు, బాధ్యతలు, శాంతిభద్ర నిర్వహణ తదితర అంశాలను విద్యార్థి దశలోనే తెలుసుకోడానికి ఈ ఓపెన్ హౌస్ కార్యక్రమం దోహదపడుతుందన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజలు అందరూ పోలీస్ శాఖకు సహకరించాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ యుగందర్ బాబు, ఆర్‌ఐలు బాబు, మంజునాథ్, సురేశ్ బాబు, ఆర్‌ఎస్‌ఐలు పాల్గొన్నారు.
చట్ట పరిధిలో సమస్యలు పరిష్కరిస్తాం
ప్రజలు పీజీఆర్‌ఎస్‌లో ఇచ్చిన సమస్యలు చట్టపరిధిలో పరిష్కరించి న్యాయం చేస్తామని జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్ అన్నారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో పీజీఆర్‌ఎస్‌లో భాగంగా ప్రజల నుంచి ఎస్పీ వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. ప్రజలు ఇచ్చిన ఫిర్యాదులపై పూర్తిస్థాయి విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. కుటుంబ కలహాలు, అత్తారింటి వేధింపులు, ఉద్యోగం ఇప్పి స్తానని డబ్బులు తీసుకుని మోసం చేయడం, పొలం తగాదాలు, అన్నదమ్ముల ఆస్తి తగాదాల వంటివి 140 వినతులు వచ్చాయన్నారు. వాటిని విచారించి ప్రజలకు న్యాయం చేస్తామన్నారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ యుగంధర్ బాబు పాల్గొన్నారు.
 
							పోలీసు అమరవీరుల త్యాగాలు స్మరించుకుందాం

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
