 
															నేర రహిత జిల్లాగాతీర్చిదిద్దడమే లక్ష్యం
నంద్యాల: నేరరహిత జిల్లాగా నంద్యాలను తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ఎస్పీ సునీల్ షెరాన్ అన్నారు. ఆది వారం జిల్లాలోని నంద్యాల వైఎస్సార్‌నగర్, చింతకుంట్ల, పాములపాడు, కొండమనాయినిపల్లెలో, నెహ్రూనగర్, పగిడ్యాల, లక్ష్మితండాలో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. అనుమానిత ప్రాంతాలు, రౌడీ షీటర్లు, అనుమానాస్పద వ్యక్తుల ఇళ్లలో విస్తృతంగా సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో 111 క్వార్టర్ మద్యం బాటిళ్లు, 8 బీర్లు, 24 మోటారు బైక్‌లు స్వాధీ నం చేసుకున్నారు. ఎవరైనా చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
