 
															ఉప్పొంగిన బుచ్చమ్మ కుంట
● స్తంభించిన రాకపోకలు
కోవెలకుంట్ల: మండలంలోని కంపమల్ల– ఉయ్యాలవాడ ఆర్‌అండ్‌బీ రహదారిలో శనివారం బుచ్చమ్మ కుంట ఉప్పొంగి ప్రవహించింది. దీంతో కంపమల్ల, క్రిష్టిపాడు, హరివరం నుంచి కోవెలకుంట్ల, దొర్నిపాడు ప్రాంతాలకు వెళ్లేందుకు రాకపోకలు స్తంభించి పోయాయి. ఆయా గ్రామాల ప్రజలు ఉయ్యాలవాడ మీదుగా రాకపోకలు కొనసాగించారు. కుంట పరివాహకంలో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో సాగు చేసిన వంద ఎకరాల్లో మిరప, వరి, మినుము, తదితర పంటలు నీట మునిగి నష్టం వాటిల్లింది. అధికారులు పంటనష్టం అంచనా వేసి పరిహారం చెల్లించాలని రైతులు కోరుతున్నారు.
పొంగిపొర్లిన మద్దిలేరు వాగు
బేతంచెర్ల: ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో శ్రీ మద్దిలేటి నరసింహ స్వామి ఆలయం సమీపంలోని మద్దిలేరు వాగు శనివారం పొంగి పొర్లింది. ఈ ఏడాది ఇప్పటి వరకు ఈ వాగు పారలేదు. కొండపైనుంచి వాగు జాలు వారుతూ శనివారం కనువిందు చేసింది. భక్తులు వర్షంలో తడుస్తూనే స్వామి వారిని దర్శించుకున్నారు.
 
							ఉప్పొంగిన బుచ్చమ్మ కుంట

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
