 
															తెలుగుగంగ ప్రధాన కాలువకు గండి?
చాగలమర్రి: నంద్యాల జిల్లా చాగలమర్రి మండలంలోని డి.వనిపెంట గ్రామ సమీపంలో తెలుగంగ ప్రధాన కాలువలో నీటి ప్రవాహం అధికంగా ఉండటంతో పులి గుండం ప్రదేశంలోని 84వ కిలోమీటరు వద్ద గండి పడినట్లు సమాచారం. దీంతో అప్రమత్తమైన మండల తహసీల్దార్ విజయ్‌కుమార్, ఎస్‌ఐ సురేష్, తెలుగంగ అధికారులు గండి పడిన ప్రదేశాన్ని పరిశీలిస్తున్నారు. గండి పడి ప్రవహిస్తున్న నీరు డి.వనిపెంట, చెంచుగూడెం గ్రామాల్లోని పంట పొలాలను ముంచెత్తుతూ చెంచుగూడెం సమీపంలోని చౌటువంకలోకి భారీగా ప్రవహిస్తున్నాయి. ఈ నీరు డి.కొత్తపల్లె గ్రామంలో ఉన్న ఊరవంక నుంచి భవనాసిలోకి గొడిగనూరు మీదుగా ఉద్ధృతంగా పారుతున్నాయి. నీటి ప్రవాహం ఇలాగే కొనసాగితే తీవ్ర నష్టం తప్పదని డి.వనిపెంట, డి.కొత్తపల్లె గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై తహసీల్దార్ విజయకుమార్ మాట్లాడుతూ కాలువకు ఎక్కడా గండి పడలేదని, 84వ కిలోమీటరు వద్దనున్న అండర్ టన్నెల్ నుంచి అటవీ ప్రాంతంలో నీటి ఊట పారుతోందన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
