పొలంలో రక్త పింజరి | - | Sakshi
Sakshi News home page

పొలంలో రక్త పింజరి

Oct 24 2025 2:44 AM | Updated on Oct 24 2025 2:44 AM

పొలంల

పొలంలో రక్త పింజరి

మహానంది: బుక్కాపురం గ్రామానికి చెందిన గాజుల వెంకటేశ్వర్లు సాగు చేస్తున్న గడ్డి పొలంలో గురువారం రక్తపింజరి పాము కనిపించడంతో భయాందోళనకు గురయ్యారు. గడ్డి కోసేందుకు వెళ్లిన వారు పామును గుర్తించి పరుగులు తీశారు. అయ్యన్ననగర్‌ గ్రామానికి చెందిన స్నేక్‌ క్యాచర్‌ మోహన్‌కు సమాచారం అందించారు. మోహన్‌ పొలం వద్దకు చేరుకొని గడ్డి మొక్కల మధ్య ఉన్న నాలుగు అడుగుల పొడవున్న రక్తపింజరి పామును చాకచక్యంగా పట్టుకుని సమీపంలోని నల్లమల అడవిలో వదిలేశారు.

రైలు కిందపడి వ్యక్తి మృతి

డోన్‌ టౌన్‌: స్థానిక రైల్వే స్టేషన్‌లో ఓ వ్యక్తి రైలు ఎక్కుతూ ప్రమాదవశాత్తూ కాలు జారి రైలు కిందపడి మృతి చెందాడు. రైల్వే ఎస్‌ఐ బింధుమాధవి తెలిపిన వివరాల మేరకు.. పట్టణంలోని త్రివర్ణకాలనీకి చెందిన ఫెయింటర్‌ సతీష్‌ (52) గురువారం ఉదయం పని నిమిత్తం గుంతకల్లు నుంచి కాచిగూడ మీదుగా బోధన్‌ వెళ్లే రైలు కదులుతున్న సమయంలో ఎక్కడానికి ప్రయత్నించాడు. కాలు జారీ కింద పడటంతో అతనిపై రైలు వెళ్లడంతో తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

లైంగిక నేరాలపై

విద్యార్థులకు అవగాహన

కర్నూలు టౌన్‌: లైంగిక నేరాలపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ అన్నారు. గురువారం పోలీసు సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలోని పాఠశాలలో విద్యార్థులకు లైంగిక నేరాలు, మహిళలు, పిల్లల రక్షణలో విద్యార్థుల పాత్ర అన్న అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. విద్యార్థు ల్లో ఉన్న ప్రతిభను వెలికి తీయడం, పోలీసు శాఖ పట్ల పూర్తి అవగాహన కల్పించడం కోసమే ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పోలీసు శాఖ వెల్లడించింది. వ్యాస రచన పోటీ ల్లో ప్రతిభ చాటిన వారికి ప్రశంసాపత్రాలు, బహుమతులు అందజేశారు.

మద్యం మత్తులో వీరంగం

రైల్వేస్టేషన్‌ పరిసరాలు శుభ్రం చేయాలని శిక్ష విధించిన న్యాయమూర్తి

కడప కోటిరెడ్డిర్కిల్‌: తిరుపతి నుంచి చర్లపల్లికి వెళుతున్న రైలులో మద్యం తాగి తోటి ప్రయాణికులకు ఇబ్బందులు సృష్టించిన యువకుడికి శిక్షగా రైల్వే స్టేషన్‌ పరిసరాలను శుభ్రం చేయించారు. రైల్వే పోలీసుల కథనం మేరకు ఈనెల 18వ తేదీ కర్నూలు జిల్లా దేవనకొండకు చెందిన వి.రవి అనే యువకుడు తిరుపతి–చర్లపల్లి రైలు లో వెళుతూ మద్యం మత్తులో ఇతర ప్రయాణికులకు ఇబ్బందులు కలిగించాడు. ఈ క్రమంలో సమాచారం అందుకున్న జీఆర్‌పీ, ఆర్‌పీఎఫ్‌ సిబ్బంది రైలు కడప రైల్వేస్టేషన్‌ మూడవ ప్లాట్‌ఫారానికి చేరుకున్న వెంటనే యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. బీఎన్‌ఎస్‌ యాక్టు 355 ప్రకా రం కేసు నమోదు చేశారు. రవి చేసిన తప్పునకు శిక్షగా కడప రైల్వేస్టేషన్‌ను మూడు గంటల పాటు అతనితో శుభ్రం చేయించాలని గురువారం అసిస్టెంట్‌ సెకండ్‌ క్లాస్‌ జూనియర్‌ మెజిస్ట్రేట్‌ ఆదేశించారు. ఈ మేరకు పోలీసులు యువకుడి చేత రైల్వే స్టేషన్‌ పరిసరాలను శుభ్రం చేయించారు.

పొలంలో రక్త పింజరి 1
1/1

పొలంలో రక్త పింజరి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement