 
															ఆర్జేడీ ఆకస్మిక తనిఖీ
చాగలమర్రి: విద్యా శాఖ ఆర్జేడీ శామ్యూల్ గురువారం చాగలమర్రిలోని జిల్లాపరిషత్ బాలుర, బాలికల ఉన్నత, కేజీబీవీ, జూనియర్ కళాశాలలను ఆకస్మికంగా తనిఖి చేశారు. ఆయా పాఠశాలలో ఉపాధ్యాయుల బోధన విధానాన్ని పరిశీలించారు. ఉపాధ్యాయులు విద్యార్థుల సామర్థ్యాన్ని పెంచే విధంగా సులభం అర్థమయ్యే పద్ధతిలో విద్యాబోధన చేపట్టాలని సూచించారు. విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనం పోషకాలతో పాటు నాణ్యమైన భోజనాన్ని అందించే విధంగా ప్రధానోపాధ్యాయులు చర్యలు తీసుకోవాలన్నారు. అదే విధంగా మెనూ ప్రకారం భోజనం అందించాలని, నాణ్యత ప్రమాణాలు పాటించాలని సూచించారు. ఆయన వెంట ఎంఈఓలు అనురాధ, న్యామతుల్లా, ప్రధానోపాధ్యాయులు జీవయ్య, శివలక్ష్మీ, ఎస్‌ఓ స్వప్న తదితరులున్నారు. కాగా నెల రోజుల క్రితం చాగలమర్రిలోని సెయింట్‌ఆన్స్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థిపై నాన్ టిచింగ్ స్టాఫ్ దాడి ఘటనపై ఆయన స్పందిస్తూ.. పాఠశాల యాజమాన్యానికి నోటీసులు ఇచ్చామన్నారు. విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
