 
															ఆలూరులో భారీ వర్షం
ఆలూరు రూరల్: అల్పపీడన ప్రభావంతో గురువారం ఆలూరులో కుండపోత వర్షం కురిసింది.దీంతో రహదారులన్నీ జలమయమయ్యాయి. మధ్యా హ్నం 1 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఏకధాటిగా వర్షం కురిసింది. వాగులు వంకలు పొంగిపొర్లాయి. పాత బస్టాండు సమీపంలోని జూనియ ర్ కళాశాల ముందు ఎల్లార్తి రోడ్డులోని ఫైర్ స్టేషన్ ఎదురుగా ఉన్న రహదారులు చెరువులను తలపించాయి. అలాగే మండలంలోని అన్ని గ్రామాల్లో వర్షం కురిసింది.
హాలహర్వి: మండలంలో గురువారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు కాలనీల్లోకి నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. విరుపాపురం, బిలేహాల్, గూళ్యం, నిట్రవట్టి, బాపురం, పచ్చారపల్లి తదితర గ్రామాల్లో వాగులు, వంకలు పొంగి పొర్లాయి. దీంతో ఆయా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
 
							ఆలూరులో భారీ వర్షం

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
