
సర్వేలతో ఇబ్బందులు పడుతున్నాం
సచివాలయాల్లో ఉద్యోగులుగా పని చేసేందుకు మాకు ఏమాత్రం ఇబ్బంది లేదు. అయితే ప్రస్తుతం వలంటీర్లు లేకపోవడంతో ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి సర్వేను తామే చేయాల్సి వస్తుండటంతో ఇబ్బందులు పడుతున్నాం. మనమిత్ర ఇంటింటికి కార్యక్రమం చేయాల్సి వస్తుండటంతో సచివాలయ ఉద్యోగుల ఆత్మగౌరవం దెబ్బతీసేలా ఉంది. ఈ కార్యక్రమం గురించి ప్రభుత్వం పునరాలోచన చేయాలి. – పరమేష్,
పంచాయతీ కార్యదర్శి, ఎస్.నాగులవరం
సచివాలయాల్లో ఎంతో మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. ఇప్పటి వరకు ఉన్న సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వానికి, అధికారులకు ఎన్నో మార్లు విన్నవించాం. గ్రామాల్లో సర్వేలు చేసి ఎప్పటికప్పుడు నివేదికలు అందజేయాలంటూ సెలవులు, పండుగ దినాలు, ఆదివారాల్లో కూడా విధులు నిర్వహించాల్సి వస్తుండటంతో ఇబ్బందులు పడుతున్నాం. ఒత్తిడి లేని పనులు కల్పించి సచివాలయాల్లో ప్రజలకు అందించే సేవలు ఏ మాత్రం ఇబ్బంది లేకుండా అందేలా చూడాలి.
– సంతోష్‌రెడ్డి, ఏఎస్‌ఈ సంఘం జిల్లా అధ్యక్షుడు

సర్వేలతో ఇబ్బందులు పడుతున్నాం