
యు. కొత్తపల్లె విలేజ్ క్లినిక్‌కు జాతీయస్థాయి గుర్తింప
డోన్: మెరుగైన వైద్యసేవలు అందించిన యు.కొత్తపల్లె ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రానికి (విలేజ్ క్లినిక్) కేంద్ర ప్రభుత్వం నుంచి అరుదైన గుర్తింపు లభించింది. ఈ ఆరోగ్య కేంద్రానికి నేషనల్ హెల్త్ సిస్టం రీసోర్స్ సెంటర్‌గా గుర్తింపు పొందిందని గ్రామ సర్పంచ్ వై.విద్య తెలిపారు. సోమవారం ఆమె మాట్లాడుతూ.. ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సీ ప్రత్యేక బృందం గతంలో ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీచేసిందన్నారు. 91.35 శాతం ఆసుపత్రి సిబ్బంది రోగులకు మెరుగైన సేవలు, సౌకర్యాలు కల్పిస్తున్నారని గుర్తించి కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేశారన్నారు. ఏఎన్‌ఎం సుజాత, ఆశావర్కర్ రంగలక్ష్మి కృషితో యు.కొత్తపల్లె గ్రామానికి జాతీయస్థాయిలో గుర్తింపు లభించినట్లు సర్పంచ్ తెలిపారు.