
యూరి‘యాతన’!
రైతులకు ఎక్కడి లేని కష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం తెచ్చి పెట్టింది. పంటలకు కావాల్సిన ఎరువుల్ని స్టాక్ లేకుండా చేసింది. ముందస్తుగా వచ్చిన వర్షాలతో రైతులు కొన్ని పంటలు వేశారు. అవి పండితే అప్పులు తీరుతాయని అన్నదాతలు అనుకుంటున్న తరుణంలో పంటల ఎదుగుదలకు అవసరమైన యూరియా కరువైంది. దీంతో రైతులకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. రైతులందరికీ కౌతాళం రైతు సేవా కేంద్రం వద్ద యూరియా ఇస్తామని చెప్పారు. దీంతో గురువారం రైతులు వందలాదిగా తరలివచ్చారు. తమ పట్టాదారు పాస్‌పుస్తకాలను వరుస పద్ధతిలో క్యూలో పెట్టుకుని నిరీక్షించారు. మధ్యహ్నం వచ్చిన మూడు, అనంతరం వచ్చిన మరో మూడు లోడ్లు రైతులకు ఏ మాత్రం సరిపోలేదు. దీంతో వ్యవసాయాధికారి శేషాద్రితో రైతులు చాలాసేపు వాగ్వాదం చేశారు. అనంతరం మరో రెండు లోడ్ వచ్చినా రైతులకు సరిపోలేదు. యూరియా కోసం అష్టకష్టాలు పడాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిందని రైతులు మండిపడ్డారు. – కౌతాళం
యూరియా కోసం పాస్ పుస్తకాలను వరుసలో పెట్టి నిరీక్షిస్తున్న రైతులు●
● క్యూలో నిల్చున్నా అందని వైనం ● రైతులకు తప్పని తిప్పలు