
● ఆమె భర్తకు తీవ్రగాయాలు ● బైక్‌పై వెళ్తుండగా మినీలారీ
రోడ్డు ప్రమాదంలో మహిళ దుర్మరణం
పాణ్యం: మండల పరిధిలోని తమ్మరాజుపల్లె గ్రామం వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా ఆమె భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. ఘటనపై ఎస్‌ఐ నరేంద్రకుమార్‌రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. పాణ్యంకు చెందిన శ్రీనివాసులు, భార్య భారతి (48) దంపతులు. శ్రీనివాసులుకు ఆరోగ్య సమస్యలు ఉండటంతో మంగళవారం డయాలసిస్ చేయించేందుకు ఏపీ 39 క్యూడీ 9469 నంబర్ గల స్కూటీలో కర్నూలు బయలుదేరారు. తమ్మరాజుపల్లె ఘాట్ వద్ద పెద్దమ్మ గుడి సమీపంలో కర్నూలు వైపు వెళ్తున్న ఆర్‌జే 17 జీఏ 9255 నంబరు గల మినీలారీ స్కూటర్‌ను ఢీకొట్టింది. దంపతులు కిందపడగా భారతి పైనుంచి మినీలారీ వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందింది. శ్రీనివాసులుకు తీవ్ర గాయాలు కావడంతో 108 అంబులెన్స్‌లో నంద్యాలకు తరలించారు. పల్నాడు జిల్లా దాచేపల్లిలో నివాసముంటున్న వీరు ఇటీవలే పాణ్యం వచ్చి స్థిరపడ్డారు. వారికి ముగ్గురు కుమార్తెలు సంతానం ఉన్నట్లు ఎస్‌ఐ తెలిపారు. విషయం తెలుసుకున్న బంధువులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల జీజీహెచ్‌కు తరలించారు. సమాచారం అందుకున్న హైవే పెట్రోల్ సిబ్బంది హైవేపై ట్రాఫిక్ సమస్య ఏర్పడకుండా చర్యలు చేపట్టారు.

● ఆమె భర్తకు తీవ్రగాయాలు ● బైక్‌పై వెళ్తుండగా మినీలారీ