
మాట తప్పిన నాయకులను నిలదీద్దాం
● చంద్రబాబు మోసాలను ఇంటింటికీ తీసుకెళ్దాం ● సూపర్ సిక్స్ అమలులో కూటమి వైఫల్యం ● వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాటసాని
నందికొట్కూరు: ఎన్నికల్లో ప్రజలకు హామీలు ఇచ్చి మొహం చాటేసిన కూటమి నేతలను నిలదీద్దామని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి పార్టీ నేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మంగళవారం పట్టణ సమీపంలోని చాముండి ఫంక్షన్ హాల్‌లో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ దారా సుధీర్ అధ్యక్షతన ‘బాబు ష్యూరిటీ–మోసం గ్యారంటీ’ కార్యక్రమంపై నియోజకవర్గస్థాయి సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమం క్యూఆర్ కోడ్‌ను కాటసాని, పార్టీ జిల్లా పరిశీలకురాలు కల్పలతారెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్‌బాషా, డాక్టర్ దారా సుధీర్ తదితరులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సూపర్‌సిక్స్ పథకాలను ప్రజలు నమ్మి ఓట్లు వేస్తే కూటమి గెలిచి చివరకు ప్రజలు మోసపోయారన్నారు. సూపర్ సిక్స్‌లో చెప్పినట్లుగా అన్నదాత సుఖీభవ, ఆడబిడ్డ సీ్త్రనిధి, నిరుద్యోగ భృతి, ఉచిత బస్సు పథకాలు ఏడాది పూర్తయినా ఎందుకు అమలు చేయడం లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో చిన్నారులపై, మహిళలపై హత్యాచారాలు జరుగుతున్న కూటమి ప్రభుత్వం మొద్దు నిద్ర వీడటం లేదన్నారు. ముచ్చుమర్రిలో చిన్నారి ఆచూకీ ఇంత వరకు కనిపెట్టలేదంటే ఎంత దారుణమన్నారు. చంద్రబాబు మోసాలను ఇంటింటికీ తెలియజేయాలని వారు పిలుపునిచ్చారు. నందికొట్కూరు నియోజకవర్గ ప్రజలకు వైఎస్సార్ కుటుంబానికి వీడదీయలేని బంధం ఉందని గుర్తు చేఽశారు. మల్యాల ఎత్తిపోతల పథకం నుంచి హంద్రీనీవా కాలువ ద్వారా కుప్పం వరకు సాగు, తాగు నీరు అందుతుందంటే వైఎస్సార్ చలవేనన్నారు.
● ఎమ్మెల్సీ ఇసాక్‌బాషా, జిల్లా పరిషత్ చైర్మన్ యర్రబోతుల పాపిరెడ్డి మాట్లాడుతూ.. ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్ ఇవ్వడంతో ఎందరో డాక్టర్లు, ఇంజనీర్లు అయ్యారని గుర్తు చేశారు. సూపర్‌సిక్స్ పథకాలు అమలు చేసిన పాపాన పోలేదన్నారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ పట్టణ అధ్యక్షులు మన్సూర్, జడ్పీటీసీలు యుగంధర్‌రెడ్డి, పుల్యాల దివ్య, జగదీశ్వరరెడ్డి, సోమల సుధాకర్‌రెడ్డి, కౌన్సిలర్ మంగళి కృష్ణ, సర్పంచులు జనార్దన్‌గౌడ్, నాగార్జునరెడ్డి, నాయకులు శివరామకృష్ణారెడ్డి, లోకేష్‌రెడ్డి, రమేష్‌నాయుడు, పుల్యాల నాగిరెడ్డి, కోకిల రమణారెడ్డి, నాగభూషణంరెడ్డి, లడ్డూ, అబుబక్కర్, రాజు, జబ్బార్, తిరుమల్లేశ్వరరెడ్డి, కృష్ణారెడ్డి, స్వామిదాసు, మాధురి, సురేష్, ఉపేంద్రారెడ్డి, సులోచన, శ్రీకాంత్, జగన్ రఫి, బంగారు, శివ, సుధాకర్‌రెడ్డి, మాసుంబాషా, మల్లయ్య, విజయకుమార్, రమణ, భాస్కరరెడ్డి, రామసుబ్బారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

మాట తప్పిన నాయకులను నిలదీద్దాం