
దిగుబడి మొత్తం కొనుగోలు చేయాలి
ఎకరాకు రూ.1.50 లక్షలు వెచ్చించి మూడు ఎకరాల్లో పొగాకు సాగు చేశా. ఇప్పటి వరకు 12 బేళ్లు మాత్రమే కంపెనీలు కొనుగోలు చేశాయి. మిగిలిన 18 బేళ్లు ఇంటి వద్దనే ఉన్నాయి. సాగు చేసిన పొగాకును కొనుగోలు చేస్తామని మొదట కంపెనీలు హామీ ఇచ్చాయి. వారి సూచనలతోనే గత ఏడాది కంటే ఈ ఏడాది మరో ఎకరంలో అదనంగా సాగు చేశా. ప్రభుత్వం కొనుగోలు చేసి ఆదుకోకపోతే ఆత్మహత్యలే శరణ్యం.
– మాబాషా, మహదేవపురం, శిరివెళ్ల మండలం
రైతులను ఆదుకోవాలి
జిల్లా రైతులు సాగు చేసిన పొగాకు మొత్తాన్ని మార్క్ ఫెడ్ ద్వారా మద్దతు ధరతో కొనుగోలు చేయాలి. రైతులు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం శోచనీయం. దాదాపు 2వేల ఎకరాల్లో సాగు అయిన కేఎస్‌సీ పొగాకును ఇంత వరకు అమ్మకాలు జరగకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. దిగుబడి మొత్తం కొనుగోలు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులతో ఉద్యమాలు చేపడతాం.– రామచంద్రుడు, ఏపీ రైతు
సంఘం జిల్లా సహాయ కార్యదర్శి, నంద్యాల

దిగుబడి మొత్తం కొనుగోలు చేయాలి