
పర్యావరణాన్ని కాపాడుకుందాం
పాణ్యం: పర్యావరణాన్ని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అన్నారు. శనివారం పాణ్యంలో నిర్వహించిన ‘స్వర్ణాంధ్ర.. స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. స్థానిక మార్కెట్ యార్డులో చెత్తను సేకరించారు. స్థానిక మహిళలకు పరిసరాల శుభ్రతపై అవగాహన కల్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ నానాటికీ కాలుష్యం పెరిగి పర్యావరణం దెబ్బతింటుందన్నారు. అందరూ మొక్కలు నాటి పెంచాలని సూచించారు. ప్లాస్టిక్ రహిత సమాజం కోసం కృషి చేయాలన్నారు. అనంతరం ప్లాస్టిక్ బాటిళ్లతో తయారు చేసి బెంచ్‌ని పరిశీలించారు. ఈ సందర్భంగా మొక్కలు నాటారు. కార్యక్రమంలో డీపీఓ శివారెడ్డి, ఎంపీపీ ఉసేన్‌బీ, తహసీల్దార్ నరేంద్రనాథ్‌రెడ్డి, ఎంపీడీఓ ప్రవీణ్‌కుమార్, ఐసీడీఎస్ సూపర్‌వైజర్ నాగసుంకమ్మ ఈఓఆర్డి చంద్రమౌళేశ్వర్‌గౌడ్, ఎంఈఓ కోటయ్య, ఏపీఓ శేషన్న, ఆర్‌డబ్ల్యుఏస్ ఏఈ మధుశేఖర్ పాల్గొన్నారు.