అనుకున్నట్లే జరిగింది. మంత్రి టీజీ భరత్‌ కుటుంబానికి చెందిన ఆల్కలీస్‌ ఫ్యాక్టరీ విస్తరణపై చేపట్టిన ప్రజాభిప్రాయసేకరణ పూర్తి ఏకపక్షంగా సాగింది. పక్కా స్క్రిప్ట్‌ ప్రకారం ఎవరు మాట్లాడాలి? ఏం మాట్లాడాలి? అని ముందే కొంతమందిని ప్రత్యేకంగా ఎంపిక చేసి వారితో అను | - | Sakshi
Sakshi News home page

అనుకున్నట్లే జరిగింది. మంత్రి టీజీ భరత్‌ కుటుంబానికి చెందిన ఆల్కలీస్‌ ఫ్యాక్టరీ విస్తరణపై చేపట్టిన ప్రజాభిప్రాయసేకరణ పూర్తి ఏకపక్షంగా సాగింది. పక్కా స్క్రిప్ట్‌ ప్రకారం ఎవరు మాట్లాడాలి? ఏం మాట్లాడాలి? అని ముందే కొంతమందిని ప్రత్యేకంగా ఎంపిక చేసి వారితో అను

May 15 2025 1:58 AM | Updated on May 15 2025 1:58 AM

అనుకు

అనుకున్నట్లే జరిగింది. మంత్రి టీజీ భరత్‌ కుటుంబానికి చె

పోలీస్‌, రెవెన్యూ శాఖ

అధికారుల సమక్షంలోనే దాడి

కాలుష్య కారకాలు వెదజల్లకుండా చర్యలు తీసుకోవాలని ఆర్‌డీఓకు వినతిపత్రం ఇచ్చేందుకు ప్రయత్నించా. ఇంతలోనే కర్నూలుకు చెందిన కొందరు గూండాలు నన్ను ఎత్తుకొని వెనుక వైపు తీసుకెళ్లారు. విచక్షణరహితంగా కొట్టారు. చివరకు కింద పడేసి గొంతుపై చెప్పుల కాళ్లతో తన్నారు. పోలీసులు చూసినా పట్టించుకోలేదు. ఇది ప్రజాస్వామ్యమా, లేదంటే టీజీ వెంకటేష్‌స్వామ్యమా. ప్రజాభిప్రాయ సేకరణను రద్దు చేసి మళ్లీ కలెక్టర్‌ సమక్షంలో నిర్వహించాలి.

– రాఘవేంద్ర, డీవైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు

ప్రైవేట్‌ గూండాల మధ్య

ప్రజాభిప్రాయ సేకరణా?

టీజీవీ గ్రూపు ఏర్పాటు చేయనున్న ప్రమాదకర పీటీఎఫ్‌ఈ, సీపీవీసీ పరిశ్రమ విస్తరణకు సంబంధించి బుధవారం గొందిపర్లలో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణ పూర్తిగా ప్రైవేట్‌ గూండాల కనుసన్నల్లో జరిగింది. ప్రజా సంఘాల నాయకులపై ప్రైవేట్‌ సైన్యం విచ్చలవిడిగా దాడి చేసింది. అభ్యంతరాలను ఇవ్వడానికి వెళితే తీసుకోకుండా దాడులు చేశారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం కలుగజేసుకొని పరిశ్రమ విస్తరణను అడ్డుకోవాలి. లేదంటే పోరాటాలకు దిగుతాం.

– వై.నగేష్‌, డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి

నా సెల్‌ఫోన్‌ను లాక్కున్నారు

నేను నాకున్న అభ్యంతరాలను ఇవ్వాలని ముందుగానే సభకు వెళ్లాను. అయితే నన్ను కొందరు ప్రైవేట్‌ గూండాలు గుర్తించి మధ్యలో బయటకు లాక్కెళ్లి పడేశారు. అప్పుడే నా సెల్‌ఫోన లాక్కున్నారు. అందులో ఏమీ లేవన్నా వినలేదు. ఇంతవరకు నా సెల్‌ను ఎవరిని అడిగినా ఇవ్వడంలేదు. రేపు టూటౌన్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తా. – ఎండీ ఆనందబాబు,

కేవీపీఎస్‌ జిల్లా కార్యదర్శి

రాయలసీమ ఆల్కలీస్‌ ఫ్యాక్టరీ

కర్నూలు(రూరల్‌)/కర్నూలు(సెంట్రల్‌): రాయలసీమ ఆల్కలీస్‌ ఫ్యాక్టరీలో టెఫ్లాన్‌(పీటీఎఫ్‌ఈ) తయారీ పరిశ్రమ కోసం బుధవారం గొందిపర్లలో ప్రజాభిప్రాయసేకరణ సభ నిర్వహించారు. కాలుష్యనియంత్రణ మండలి ఈఈ కిషోర్‌కమార్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సభలో ఆర్డీవో సందీప్‌కుమార్‌, తహసీల్దార్‌ రమేశ్‌బాబుతో పాటు యాజమాన్యం తరఫున మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేశ్‌ పాల్గొన్నారు. సభలో 30మంది దాకా తమ అభిప్రాయాలు చెప్పారు. అయితే గొందిపర్లతో పాటు టీజీ వెంకటేశ్‌కు అనుకూలంగా ఉన్న వ్యక్తులు భారీ సంఖ్యలో సభకు హాజరయ్యారు. ఫ్యాక్టరీ నిర్మాణం, పీటీఎఫ్‌ఈ తయారీకి వాడే పీఎఫ్‌ఓఏతో కలిగే కాలుష్యం తదితర అంశాలపై కొన్ని రోజులుగా పలువురు శాస్త్రవేత్తలు, పౌరసంఘాలు, వామపక్షాలు ఆందోళన చేపడుతున్నాయి. ఈక్రమంలో వారెవ్వరినీ సభలోకి రాకుండా యజమాన్యం కట్టడి చేసింది. వచ్చిన కొద్దిమందిపై కూడా టీజీ ప్రైవేటు సైన్యం భౌతికదాడులు చేసి గెంటేసింది. కవరేజీకి వెళ్లిన పత్రికా విలేకరుల సెల్‌ఫోన్లు సైతం లాక్కోవడం గమనార్హం. డీవైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు రాఘవేంద్ర, కార్యదర్శి నగేశ్‌, కేవీపీఎస్‌ జిల్లా కార్యదర్శి ఎండీ ఆనంద్‌బాబు, ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి రామకృష్ణలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంటే ప్రైవేటు సైన్యం, పోలీసులు వారిని అక్కడి నుండి లాక్కుని బయటకు తీసుకెళ్లారు. టీజీ ప్రైవేటు సైన్యం రాఘవేంద్ర గొంతుపై కాలుతో తొక్కేశారు. ఎండీ ఆనంద్‌బాబుపై పిడిగుద్దలు గుద్ది మొబైల్‌ఫోన్‌ కూడా లాక్కున్నారు. నగేశ్‌, రామకృష్ణను కూడా బయటకు లాగేసి విచక్షణా రహితంగా దాడి చేశారు. ఓవైపు ఆర్డీవో సందీప్‌కుమార్‌ మాట్లాడేందుకు అందరికీ అవకాశం ఇస్తామని చెబుతుంటే మరోవైపు టీజీ ప్రైవేటు సైన్యం ప్రజా సంఘాలు, వామపక్షాల ప్రతినిధులను విచక్షణారహితంగా లాక్కెళ్లి దాడి చేయడం గమనార్హం. ఇదంతా పోలీసుల సమక్షంలోనే జరుగుతున్నా వారు ప్రేక్షక పాత్ర పోషించడంతో పాటు ప్రైవేటు సైన్యానికి అనుకూలంగా వ్యవహరించారు. దీంతో ప్రజాసంఘాలు, వామపక్షాలు తీవ్ర ఆవేదనకు గురయ్యాయి. ప్రజాస్వామ్యంలో ప్రజాభిప్రాయసేకరణ జరుగుతుంటే కనీసం అభిప్రాయాలు వినేందుకు కూడా యాజమాన్యం అంగీకరించకపోవడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

పీటీఎఫ్‌ఈ వాడకానికి వాడే

రసాయనం ఏంటో స్పష్టత ఇవ్వని వైనం

పీటీఎఫ్‌ఈ తయారీకి పీఎఫ్‌ఓఏ వాడుతున్నారని శాస్త్రవేత్తలు, ప్రజా సంఘాలు, వామపక్షాలు కొద్దిరోజులుగా ఆందోళన చేస్తున్నాయి. అయితే టీజీ వెంకటేశ్‌ పీఎఫ్‌ఓఏ వినియోగించబోమని, దానికి ప్రత్యామ్నాయం వాడతామని మంగళవారం ప్రకటించారు. ప్రత్యామ్నాయంగా ఏ రసాయనం వాడతారో స్పష్టత ఇవ్వలేదు. బుధవారం జరిగిన ప్రజాభిప్రాయసేకరణలో ఈ అంశంపై స్పష్టత ఇవ్వలేదు. ఏ రసాయనాలు వాడతారు? ఏ టెక్నాలజీ వాడతారు అనేది ప్రభుత్వానికి సమర్పించిన ఈఐఏ(పర్యావరణ ప్రభావ అంచనా నివేదిక)లోనూ పేర్కొనలేదు. అసలు టెక్నాలజీ, ఏ రసాయనాలు వాడుతారో యజమాన్యానికి స్పష్టత లేకుండా, ప్రజలకు స్పష్టం చేయకుండా గోప్యంగా ఉంచాల్సిన అవసరమేంటని ప్రజాసంఘాలు ప్రశ్నిస్తున్నాయి.

టీజీ గ్రూపు ఆల్కలీస్‌ ఫ్యాక్టరీ విస్తరణపై ఏకపక్షంగా ప్రజాభిప్రాయ సేకరణ

ఫ్యాక్టరీపై అభ్యంతరాలు చెప్పిన వారిపై భౌతిక దాడులకు దిగిన యాజమాన్యం

డీవైఎఫ్‌ఐ, కేవీపీఎస్‌ అధ్యక్ష, కార్యదర్శులపై విచక్షణారహితంగా దాడి

వార్తలు కవర్‌ చేసేందుకు వెళ్లిన విలేకరుల మొబైల్‌ఫోన్లు లాగేసుకున్న భద్రతా సిబ్బంది

తమకు అనకూలంగా మినిట్స్‌ నమోదు చేసి ప్రభుత్వానికి సిఫారసు

ఫ్యాక్టరీకి అనుకూలంగా మినిట్స్‌ పంపేందుకు సిద్ధమైన అధికారులు

జీవనోపాధి కోల్పోతాం

కెమికల్‌ ఫ్యాక్టరీకి అనుమతులు ఇవ్వొద్దు

రాయలసీమ ఆల్కలిస్‌ (ఎస్‌ఆర్‌ఎఎిసీ) ఫ్యాక్టరీకి అనుబంధంగా రసాయనాల తయారీ పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వొద్దని అధికారులకు ఆంధ్రప్రదేశ్‌ రజక వృత్తిదారులు సంఘం జిల్లా కార్యదర్శి సి.గురుశేఖర్‌ వినతిప త్రం ఇచ్చారు. ఫ్యాక్టరీ చుట్టూ పది గ్రామాల్లో చేతివృత్తులపై ఆధారపడి జీవించే వారు జీవన ఉపాధి కోల్పోతారని ఆయన వినతిపత్రంలో పేర్కొన్నారు. టీజీవీ ఆల్కలిస్‌ ఫ్యాక్టరీలో బుధవారం ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. కెమికల్‌ ఫ్యాక్టరీ వద్దని అధికారులకు పలువురు వినతిపత్రాలు అందజేశారు. ఇ.తాండ్రపాడు గ్రామాన్ని టీజీ వెంకటేష్‌ దత్తత తీసుకొని ధోబీఘాట్‌ నిర్మిస్తామని హామీ ఇచ్చి మూడు సంవత్సరాలు అవుతున్నా అమలు చేయలేదని గుర్తు చేశారు.

కేంద్ర ప్రభుత్వానికి నివేదిక

ప్రజాభిప్రాయ సేకరణలో మొత్తంగా 30మంది అభిప్రాయాలను కమిటీ సేకరించింది. దీని మినిట్స్‌పై నివేదికను కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మంత్రిత్వశాఖకు పంపనున్నారు. అధికారులు పూర్తిగా యజమాన్యానికి లొంగిపోయి నిజాలు దాచి వారికి అనుకూలంగా నివేదికను ప్రభుత్వానికి పంపనున్నట్లు వామపక్షాలు, ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. ప్రజాభిప్రాయసేకరణ అప్రజాస్వామిక నిర్వహించడం, ప్రతినిధులపై దాడి చేయడాన్ని నిరసిస్తూ ప్రజాసంఘాల ఐక్య వేదిక, వామపక్షాల ఆధ్వర్యంలో నేడు కలెక్టర్‌ ఎదుట భారీ నిరసన చేపట్టనున్నట్లు ప్రజాసంఘాల ఐక్య వేదిక కన్వీనర్‌ రామకృష్ణ తెలిపారు. సభలో ప్రాతినిధ్యానికి అవకాశం కల్పించకపోవడం, విద్యార్థి, ప్రజా, యువజన సంఘాలపై దాడి చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. నిరసనకు ప్రజాస్వామ్య వాదులు తరలిరావాలన్నారు.

అనుకున్నట్లే జరిగింది. మంత్రి టీజీ భరత్‌ కుటుంబానికి చె1
1/1

అనుకున్నట్లే జరిగింది. మంత్రి టీజీ భరత్‌ కుటుంబానికి చె

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement