నేడు ఆఫ్‌లైన్‌లో నీట్‌ పరీక్ష | - | Sakshi
Sakshi News home page

నేడు ఆఫ్‌లైన్‌లో నీట్‌ పరీక్ష

May 4 2025 6:19 AM | Updated on May 4 2025 6:19 AM

నేడు ఆఫ్‌లైన్‌లో నీట్‌ పరీక్ష

నేడు ఆఫ్‌లైన్‌లో నీట్‌ పరీక్ష

కర్నూలు(సిటీ): వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశానికి ఎన్‌టీఏ ఆదివారం నిర్వహించనున్న జాతీయస్థాయి అర్హత ప్రవేశ పరీక్ష(నీట్‌)కు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. కర్నూలు జిల్లాలో 16 పరీక్షా కేంద్రాల్లో 4,466 మంది, నంద్యాల జిల్లాలో 1,172 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5గంటల వరకు ఆఫ్‌లైన్‌ విధానంలో పరీక్ష నిర్వహించనున్నారు. ఇందుకు జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. విద్యార్థులు సకాలంలో కేంద్రాలకు చేరుకునేందుకు సమయానికి బస్సులు, ప్రతి కేంద్రంలో దివ్యాంగుల కోసం వీల్‌చైర్లు ఏర్పాటు చేశారు. కర్నూలు నగర శివారులోని ట్రిపుల్‌ఐటీడీఎంలో ఏర్పాటు చేసిన కేంద్రానికి ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద ఎన్‌టీఏ నిబంధనల మేరకు ప్రతి ఒక్క విద్యార్థిని క్షుణ్ణంగా తనిఖీ చేయాల్సి ఉండటంతో విద్యార్థులు కనీసం రెండు గంటల ముందుగా పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. మధ్యాహ్నం 1.30 గంటల తర్వాత విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించబోమని పరీక్ష నిర్వహిస్తున్న నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ) ప్రకటించింది.

వస్త్రధారణపై ఆంక్షలు

● నీట్‌కు హాజరయ్యే విద్యార్థుల వస్త్రధారణపై ఎన్‌టీఏ కఠినమైన ఆంక్షలు విధించింది. విద్యార్థినులు జీన్స్‌ ప్యాంట్లు వంటి వస్త్రాలను ధరించకూండా, సాధారణ దుస్తుల్లోనే రావాల్సి ఉంటుంది. తలకు టోపీ, కళ్లకు బ్లాక్‌ సన్‌గ్లాసెస్‌ ధరించకూడదు. విద్యార్థినులు ముక్కుపుడక సహా చెవులకు దిద్దులు, చేతులకు గాజులతో పాటు ఎలాంటి ఆభరణాలను ధరించరాదు.

● చేతికి స్మార్ట్‌, సాధారణ వాచీలను సైతం ధరించరాదు. సమయాన్ని తెలుసుకునేందుకు వీలుగా పరీక్షా కేంద్రాల్లోని గదుల్లో గడియారాలను ఏర్పాటు చేశారు.

● బ్లూటూత్‌ వాచీలు, సెల్‌ఫోన్లు, స్మార్ట్‌ బ్యాండ్లు, పెన్నులు సహా ఇతర ఎలాంటి వస్తువులను విద్యార్థులు తమ వెంట తీసుకురాకూడదు.

ఆర్టీసీ బస్టాండ్‌ నుంచి నాలుగు బస్సులు

జగన్నాథగట్టులోని ట్రిపుల్‌ ఐటీలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రానికి చేరుకునేందుకు కర్నూలు కొత్త బస్టాండ్‌ నుంచి నాలుగు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. ఈ బస్సులు ఉదయం 10.30, 11.15, 11.45, 12.15 గంటల సమయంలో అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు.

పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు

ఎస్పీ అదిరాజ్‌సింగ్‌ రాణా

నంద్యాల(న్యూటౌన్‌): ‘నీట్‌’ కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు చేస్తున్నట్లు ఎస్పీ అదిరాజ్‌సింగ్‌ రాణా తెలిపారు. నీట్‌ కేంద్రాలు ఏర్పాటు చేసిన నంద్యాల ప్రభుత్వ డిగ్రీ, పాలిటెక్నిక్‌ ప్రభుత్వ కశాళాలలను శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నీట్‌ కేంద్రాల్లోకి ఎలక్ట్రానిక్‌ వస్తువులను అనుమతించేది లేదన్నారు. విద్యార్థులు ఆధార్‌, ఓటర్‌ ఐడీ, డ్రైవింగ్‌ లైసెన్స్‌తో పాటు గుర్తింపు పొందిన ఫొటో తప్పనిసరిగా తెచ్చుకోవాలని సూచించారు. డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ శశికళ, పాలిటెక్నిక్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ శ్రీనివాప్రసాద్‌, సీఐ కంబగిరి రాముడు, సూర్యమౌళి పాల్గొన్నారు.

ఉమ్మడి జిల్లాలో 20 పరీక్ష కేంద్రాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement