
హంస వాహనంపై దివ్య తేజం
ఆళ్లగడ్డ: నృసింహ స్వామి జయంతి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఉదయం హంస వాహనం, రాత్రి సూర్య ప్రభ వాహనాలను అధిరోహించి భక్తులను కటాక్షించారు. ఎగువ అహోబిలం క్షేత్రంలో శ్రీ లక్ష్మీనరసింహ స్వామి జయంతి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా శనివారం ఉదయం మూలమూర్తులు స్వామి అమ్మవారిని సుప్రభాత సేవతో మేలుకొలిపి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవ మూర్తులు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వాములను యాగశాలలో కొలువుంచి అర్చన, అభిషేకం, తిరుమంజనం నిర్వహించారు. అనంతరం పట్టు పీతాంబారలతో అలంకరించి కొలువుంచారు. నారసింహ స్వామిని విశేషంగా అలంకరించిన హంస వాహనంపై కొలువుంచి మాడ వీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు. రాత్రి సూర్యప్రభ వాహనం అధిరోహించి మాడ వీధుల్లో సంచరిస్తూ భక్తులను కటాక్షించారు.
ఘనంగా సూర్య ప్రభ వాహనోత్సవం
అహోబిలంలో వైభవంగా నారసింహ
జయంతి బ్రహ్మోత్సవాలు

హంస వాహనంపై దివ్య తేజం