
క్రీడాకారులకు ‘పద్మ’ అవకాశం
నంద్యాల(న్యూటౌన్): అంతర్జాతీయ క్రీడల్లో అత్యున్నత ప్రతిభ కనబరిచిన క్రీడాకారుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి రాజు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. గణతంత్ర వేడుకల సందర్భంగా 2026 సంవత్సరానికి పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ అవార్డుల ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానిస్తోందని పేర్కొన్నారు. దరఖాస్తు వివరాలను https://www.padmaawards.gov. in/ వెబ్‌సైట్‌లో పొందవచ్చని తెలిపారు. ఈ వెబ్‌సైట్‌లో క్రీడాకారులు వ్యక్తిగతంగా దరఖాస్తు చేసుకొని ఆ పత్రాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ మెయిల్‌కు పంపాలని సూచించారు. వచ్చే నెల 26వ తేదీలోగా దరఖాస్తులు పంపితే అర్హుల జాబితాను కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేస్తారని తెలిపారు.
పాలిసెట్ దరఖాస్తు గడువు పొడిగింపు
నంద్యాల(న్యూటౌన్): పాలిసెట్ దరఖాస్తు గడువును మరో రెండు రోజుల పాటు పెంచినట్లు ఈఎస్సీ పాలిటెక్నిక్ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాప్రసాద్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 15వ తేదీతో పాలిసెట్ దరఖాస్తు గడువు పూర్తయిందని, దీనిని ఈనెల 17వ తేదీ వరకు ప్రభుత్వం పెంచిందని పేర్కొన్నారు. విద్యార్థులు https:// polycetap.nic.in/Default.aspx వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. పాలిసెట్ 2025 పరీక్ష ఈనెల 30వ తేదీన నిర్వహిస్తారని తెలిపారు. మరింత సమాచారం కోసం సురేష్‌బాబు 9912377723 సంప్రదించాలన్నారు.
జిల్లాకు 7,908 ఇంటర్ పుస్తకాలు
నంద్యాల(న్యూటౌన్): ఇంటర్ విద్యార్థులకు పంపిణీ చేసేందుకు జిల్లాకు 9,970 పాఠ్యపుస్తకాలకు గాను 7,908 వచ్చినట్లు డీఐఈఓ సునీత తెలిపారు. నంద్యాల ప్రభుత్వ మహిళా జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన గోదాము నుంచి పుస్తకాలను, టెక్స్‌బుక్స్‌లను మండల కేంద్రాలకు బుధవారం తరలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సివిక్స్, కామర్స్, ఎకనామిక్స్, హిస్టరీ పుస్తకాలు జిల్లాకు ఇంకా రాలేదన్నారు. వచ్చిన వెంటనే అన్ని జూనియర్ కళాశాలలకు పంపుతామని తెలిపారు.
కేసీ కాల్వకు నీటి సరఫరా బంద్
జూపాడుబంగ్లా: కేసీ కాల్వకు సాగునీటి సరఫరా నిలిపివేసిట్లు ఏఈ శ్రీనివాసనాయక్ తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రెండు రోజుల క్రితం వరకు ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం ఓ మోటారు ద్వారా కేసీ కాల్వకు 245 క్యూసెక్కుల సాగునీటిని సరఫరా చేసేవారమన్నారు. శ్రీశైలం డ్యాంలో నీటిమట్టం తగ్గిపోయిందన్నారు. అంతేకాకుండా కేసీ కాల్వకు కేటాయించిన నీటివాటా ముగిసినందున ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కేసీ కాల్వకు నీటిసరఫరా నిలిపివేసినట్లు తెలిపారు.
సీయూలో పీజీ పరీక్షలు
కర్నూలు కల్చరల్: క్లస్టర్ యూనివర్సిటీ (సీయూ) పరిధిలో పోస్ట్‌గ్రాడ్యుయేషన్ (పీజీ) నాల్గో సెమిస్టర్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షలను బుధవారం వర్సిటీ ఇన్‌చార్జ్ వీసీ ప్రొఫెసర్ వి. వెంకట బసరావు పరిశీలించారు. పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. రిజిస్ట్రార్ డాక్టర్ కట్టా వెంకటేశ్వర్లు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డీన్ డాక్టర్ నాగరాజ్ శెట్టి, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ బాల సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.
జల్‌జీవన్ పనుల పరిశీలన
మద్దికెర: కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన రూ.1.84 కోట్ల నిధులతో మద్దికెరలో చేపట్టిన జల్‌జీవన్ మిషన్ పనులను కేంద్ర బృందం సభ్యుడు మాదేశ్వరన్ బుధవారం పరిశీలించారు. ట్యాంకు త్వరలో పనులు పూర్తి చేసి నీటిని అందిస్తారని తెలిపారు. గ్రామీణ ప్రజలు నీటి కోసం ఇబ్బందులు పడకుండా జల్‌జీవన్ మిషన్ కింద కేంద్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలు మంజూరు చేస్తోందని తెలిపారు. ఈయన వెంట ఆర్‌డబ్ల్యూఎస్ డీఈ ఎండీ ఖాన్, ఏఈ మయాంక్, ఈఓఆర్డీ మద్దిలేటిస్వామి, సచివాలయ ఏఈలు విష్ణు, చంద్రశేఖర్, బండారి ఆంజనేయులు ఉన్నారు.

క్రీడాకారులకు ‘పద్మ’ అవకాశం