మాదక ద్రవ్యాల దుష్ఫలితాలపై విస్తృత ప్రచారం | - | Sakshi
Sakshi News home page

మాదక ద్రవ్యాల దుష్ఫలితాలపై విస్తృత ప్రచారం

Apr 17 2025 1:15 AM | Updated on Apr 17 2025 1:15 AM

మాదక

మాదక ద్రవ్యాల దుష్ఫలితాలపై విస్తృత ప్రచారం

పోలీస్‌ స్టేషన్లు, గ్రామాల్లో క్యూఆర్‌ కోడ్‌

స్కానర్‌ వాల్‌ పోస్టర్లు

కర్నూలు: మాదక ద్రవ్యాల దుష్ఫలితాల గురించి జిల్లా వ్యాప్తంగా పోలీసులు విస్తృత అవగాహన కల్పిస్తున్నారు. జిల్లా ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ ఆదేశాల మేరకు మాదక ద్రవ్యాలైన డ్రగ్స్‌, గంజాయి వంటివి ఆయా ప్రాంతాల్లో అక్రమంగా పండిస్తున్నా, విక్రయిస్తున్నా దుర్వినియోగానికి పాల్పడుతున్నా ఆ సమాచారం తెలుసుకునేందుకు క్యూఆర్‌ కోడ్‌ను పోలీస్‌స్టేషన్లు పబ్లిక్‌ ప్రదేశాల్లో అతికించి ప్రజలు, యువకులు మొబైల్స్‌ నుంచి క్యూ ఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేయించి సమాచారం సేకరిస్తున్నారు. క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేసిన తర్వాత ఆయా ప్రాంతాల్లో మాదక ద్రవ్యాల గురించి సమాచారం తెలిసినట్లయితే క్యూఆర్‌ కోడ్‌ స్కానర్‌ ద్వారా తెలియజేయాలని ప్రజలకు అవగాహన కలిగిస్తున్నారు.

పిడుగు పడి మహిళ మృతి

చిప్పగిరి: పిడుగు పడి ఓ మహిళ మృతి చెందిన సంఘటన ఏరూరు గ్రామంలో బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రజియాబీ (50) గ్రామ సచివాలయం పక్కన ఉన్న పొలాల్లో ఆరబోసిన మిరపకాయలు సంచులకు ఎత్తుతుండగా ఒక్క సారిగా ఉరుములు, మెరుపులు, గాలులతో కూడిన వర్షం పడింది. అదే సమయంలో సమీపంలో పిడుగు పడటంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలికి ఐదుగురు కుమార్తెలు, కుమారుడు, భర్త ఉన్నారు. తహసీల్దార్‌ ఇజాజ్‌ అహ్మద్‌ మృతురాలి కుటుంబాన్ని పరామర్శించారు.

బియ్యం గోడౌన్‌ సీజ్‌

పాణ్యం: మండల కేంద్రం పాణ్యం సమీపంలోని గోరుకల్లు తండాలో అక్రమంగా రేషన్‌ బియ్యాన్ని నిల్వ ఉంచిన లక్ష్మానాయక్‌కు చెందిన గోడౌన్‌ను సీజ్‌ చేశారు. బుధవారం రాత్రి 9.30 గంటల సమయంలో గోరుకల్లు తండాలోని గోడౌన్‌ను ఎంపీ శబరి ఎస్‌ఐ నరేంద్రకుమార్‌రెడ్డి, రెవెన్యూ అధికారులతో చేరుకుని తనిఖీ చేశారు. దాదాపు 500 బస్తాల వరకు రేషన్‌ బియ్యం ఉండటంతో వెంటనే గోడౌన్‌, బియ్యాన్ని సీజ్‌ చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే పేదలకు అందాల్సిన రేషన్‌ బియ్యం పక్కదారిలో పడుతున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. క్షేత్ర స్థాయిలో రెవెన్యూ, సివిల్‌ సప్లయి అధికారుల పర్యవేక్షణ లోపించడంతో బియ్యం బ్లాక్‌ మార్కెట్‌కు తరులుతుందన్నారు. అనంతరం మేకల బండ వద్ద ఉన్న రేకుల షెడ్డును పరిశీలించారు. అక్కడి నుంచి తమ్మరాజుపల్లె సమీపంలో ఉన్న రైస్‌మిల్లును తనిఖీ చేశారు. ఎంపీ వెంట సివిల్‌ సప్లయి డైరెక్టర్‌ మహేష్‌ నాయుడు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

మాదక ద్రవ్యాల దుష్ఫలితాలపై విస్తృత ప్రచారం 1
1/2

మాదక ద్రవ్యాల దుష్ఫలితాలపై విస్తృత ప్రచారం

మాదక ద్రవ్యాల దుష్ఫలితాలపై విస్తృత ప్రచారం 2
2/2

మాదక ద్రవ్యాల దుష్ఫలితాలపై విస్తృత ప్రచారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement