
● ఐటీ ఉద్యోగాలు కాదని పల్లెల్లో మకాం
● కరోనా తర్వాత మారిన జీవన చిత్రం
● వరుస ఉద్యోగాల కోతతో
ఆలోచనలో మార్పు
● పంటల సాగు దిశగా అడుగులు
దేశానికి వెన్నెముక రైతన్న. వ్యవసాయం లేనిదే మానవ మనుగడ లేదంటే అతిశయోక్తి కాదు. ప్రతి ఒక్కరికీ నోట్లోకి ఐదు వేళ్లూ పోతున్నాయంటే అది అన్నదాత కష్టం. ఆరుగాలం శ్రమించి చెమట చిందిస్తే కానీ పొలం పండదు, జనానికి పూట గడవదు. ఉదయం కోడి కూయగానే భుజాన కాడి వేసుకొని బయలుదేరడం.. సాయంత్రం పొద్దు వాలగానే ఇంటికి చేరుకోవడం.. ఇదే రైతుల జీవనం. కష్టనష్టాలు బేరీజు వేసుకోకుండా మట్టినే నమ్ముకుని ఆశల జూదంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడం ఆయనకే చెల్లు. – సాక్షి, కర్నూలు డెస్క్
