ఐదు ఎకరాల్లో వేరుశనగ సాగు చేస్తాం. గత ఏడాది వరకు మే 15 నుంచే వేరుశనగ సహా అన్ని రకాల విత్తనాల పంపిణీ చేశారు. ముందస్తుగా విత్తనాలు సిద్ధం కావడంతో వర్షాలు కురిసిన వెంటనే సకాలంలో విత్తుకు అవకాశం ఉండేది. ఈ సారి సబ్సిడీపై విత్తనాల పంపిణీ జరుగుతుందో, లేదో తెలియని పరిస్థితి. ఇప్పటికీ వర్షాలు కురుస్తున్నాయి. విత్తనాల కోసం దిక్కుతు చూడాల్సి వస్తోంది. మరో నాలుగైదు రోజుల్లో విత్తనాలు అందుబాటులోకి రాకపోతే బ్లాక్‌లో కొనాల్సిందే.
– సత్యప్ప, మామిళ్లకుంట, తుగ్గలి మండలం
ఎప్పుడు పంపిణీ చేస్తారో తెలియదు
13 ఎకరాల్లో వరి, వేరుశనగ 8 ఎకరాల్లో సాగు చేస్తున్నాం. మామూలుగా అయితే పచ్చి రొట్ట ఎరువుల విత్తనాలు వినియోగించం. మొదటిసారిగా వరి నాట్లకు ముందు పచ్చిరొట్ట ఎరువుల విత్తనాలు విత్తుకోవాలనుకున్నాం. కానీ వ్యవసాయ శాఖ ఇంతవరకు విత్తనాల పంపిణీ చేపట్టలేదు. కేటాయింపులు అరకొరగా ఉన్నాయి. ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారో చెప్పడం లేదు. వ్యవసాయ శాఖ అధికారులు కూడా ఏమీ చెప్పలేకపోతున్నారు. ఇలాంటి పరిస్థితిని మొదటిసారి చూస్తున్నాం.
– కెంచప్ప, గజ్జెహళ్లి, హొలగొంద మండలం
బ్లాక్‌లో కొనాల్సి వస్తుందేమో