
హుండీల్లో కానుకలు లెక్కిస్తున్న దృశ్యం
పాణ్యం: కొత్తూరు గ్రామంలో వెలసిన శ్రీవల్లి సుబ్రమణ్యేశ్వరస్వామి హుండీ కానుకలు లెక్కించగా రూ.20.53 లక్షల ఆదాయం వచ్చింది. సోమవారం ఈఓ రామకృష్ణ ఆధ్వర్యంలో హుండీ కానుకలు లెక్కించగా రూ. 20,53,832 నగదు, మూడు గ్రాముల బంగారు, 1.760 కేజీల వెండి వచ్చింది. గత డిసెంబర్ నెల నుంచి సోమవారం వరకు భక్తులు సమర్పించిన కానుకలను దేవదాయశాఖ జిల్లా కార్యాలయ అధికారి చక్రభరత్ పర్యవేక్షణలో లెక్కించారు. హుండీ లెక్కింపులో గ్రామ పెద్దలు క్రిష్ణారెడ్డి, శివరామిరెడ్డి, మిలటరీ సుబ్బారెడ్డి, వెంకటసుబ్బయ్య, స్వచ్ఛంద సంస్థ సభ్యులు పాల్గొన్నారు.