అర్హులకు ఓటు హక్కు కల్పించాలి | - | Sakshi
Sakshi News home page

అర్హులకు ఓటు హక్కు కల్పించాలి

Jun 17 2026 5:21 AM | Updated on Jun 17 2026 5:21 AM

మునుగోడు : అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత గ్రామస్థాయి బీఎల్‌ఏలదని.. సర్‌ కార్యక్రమంలో భాగంగా తొలగిస్తున్న ఓట్లు నిజమైనవా.. కాదా అనే విషయాన్ని బీఎల్‌ఏలు పరిశీలించాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సూచించారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కాంగ్రెస్‌ పార్టీ బీఎల్‌ఏల నియోజకవర్గస్థాయి శిక్షణ శిబిరంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం 2.63 లక్షల ఓటర్లు ఉండగా అందులో 23,139 ఓట్లు బోగస్‌ అని, మరో 59,342 ఓటర్లలో వివిధ రకాల తేడాలు ఉన్నట్లు సర్‌ గుర్తించిందన్నారు. వాటిని బూత్‌స్థాయిలో బీఎల్‌ఏలు ఇంటింటికి తిరిగి వివరాలు సేకరించి అధికారులకు ఇవ్వాలని సూచించారు. బోగస్‌ ఓటర్ల తొలగింపు అనంతరం నియోజకవర్గాల పునర్‌ విభజన జరుగుతుందన్నారు. డీసీసీ అధ్యక్షుడు పున్న కై లాస్‌ నేత అధ్యక్షతనలో జరిగిన ఈ కార్యక్రమంలో డీసీసీబీ మాజీ చైర్మన్‌ కుంభం శ్రీనివాస్‌రెడ్డి, శిక్షకులు ఎండీ.నూమాన్‌, రుద్ర సంతోష్‌, మున్సిపల్‌ చైర్మన్‌ కొడి శ్రీనివాసులు, మొగుదాల పావనిరమేష్‌గౌడ్‌, చండూరు మార్కెట్‌ చైర్మన్‌ దొటి నారాయణ తదితరులు పాల్గొన్నారు.

ఫఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement