కేంద్రానికి 40 క్వింటాళ్ల ధాన్యం తెచ్చి 20 రోజులు అవుతోంది. ఇప్పటివరకు ఐదు లారీల ధాన్యం పంపారు. మళ్లీ లారీలు రాలేదు. రోజూ అడిగితే వస్తాయని చెబుతున్నారు. కానీ రావడం లేదు. ఎప్పుడు వర్షం వచ్చి ధాన్యం తడిచిపోతుందోనని భయమేస్తోంది.
– ఎలవర్తి అంజయ్య, గుండ్రపల్లి, చండూరు
15 రోజుల క్రితం ధాన్యం తెచ్చాం. తేమ పేరుతో కొద్దిరోజులు కొనుగోలు చేయలేదు.ఽ నాలుగు రోజుల క్రితం మా ధాన్యం కొన్నారు. కానీ అప్పటి నుంచి లారీలు రావట్లేదు. దీంతో ధాన్యం బస్తాలో నింపి పక్కన పెట్టారు. లారీల కోసం ఎదురుచూడాల్సి వస్తోంది.
– నాగిళ్ల ప్రవీణ్, పోలేపల్లి, చందంపేట
ఐకేపీ సెంటర్‌కు 300 బస్తాల ధాన్యం తెచ్చి నెల రోజులు అవుతోంది. ఇంతవరకు కాంటా వేయలేదు. ఇక నాలుగు రోజుల నుంచి లారీలు రావడం లేదు. దీంతో కాంటాలు వేయడం ఆపేశారు. ఎక్కడి ధాన్యం అక్కడే ఉండిపోయింది.
– జానయ్య, ఆమనగల్లు,
వేములపల్లి మండలం


