ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ
చలి కాలంలో ఆహారంపై శ్రద్ధ పెట్టాలి. ఫైబర్, రాగి జావ, సూప్‌లు ఎక్కువగా తీసుకోవాలి. నారింజ, బత్తాయి పండ్లతో పాటు ఆకు కూరలు తినాలి. చిరు ధాన్యాలతో తయారు చేసిన ఆహారం ఉత్తమం. విటమిన్–డి అందేలా సూర్యరశ్మిలో నిల్చోవాలి. జంక్ ఫుడ్ జోలికి అస్సలు వెళ్లకపోవడమే మంచిది. ఐస్‌క్రీమ్‌లకు దూరంగా ఉండాలి. మధుమేహం ఉన్నవారు తక్కువ మోతాదులో ప్రొటీన్ తీసుకోవడం మంచిది. విటమిన్–సి, జింక్ ఉన్న ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి.
– ఎం. శ్రీనివాసరావు, డైటీషియన్, ప్రభుత్వ ఆసుపత్రి, నల్లగొండ
ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ
ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ


