ఉద్యోగులపై సస్పెన్షన్ ఎత్తివేయాలి
నల్లగొండ : గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా చిన్నకాపర్తిలో జరిగిన సంఘటన విషయంలో సస్పెండ్ చేసిన ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలని నల్లగొండ జిల్లా ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక కలెక్టర్‌ను కోరింది. శనివారం ఐక్య వేదిక నాయకులు నల్లగొండలోని పీఆర్‌టీయూ భవన్‌లో విలేకరులతో మాట్లాడారు. సిబ్బంది పోలింగ్, కౌంటింగ్ సక్రమంగా నిర్వహించారని.. అయితే సర్పంచ్‌కు సంబంధించిన ఒక అభ్యర్థి బ్యాలెట్ పత్రాలు కౌంటింగ్ కేంద్రంలో వదిలేయడం వల్ల ఆర్‌ఓను సస్పెండ్ చేశారని, దీనికి సంబంధం లేని 10 మంది పీఓలను సస్పెండ్ చేయడం సరి కాదన్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉద్యోగులకు ఇచ్చే గౌరవ భత్యం కూడా అన్ని జిల్లాల్లో ఒకేలా లేదన్నారు. ప్రభుత్వం పీఆర్‌సీ నివేదికను బహిర్గతం చేయాలని, పెండిండ్‌లో ఉన్న 5 డీఏలు, హెల్త్‌కార్డులు ఇవ్వాలని కోరారు. సమావేశంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుంకరి భిక్షంగౌడ్, టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రాజశేఖర్‌రెడ్డి, డీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకులు, జనార్దన్, రాములు, కోమటిరెడ్డి నర్సింహారెడ్డి, మేకల జాన్‌రెడ్డి, పెరుమాళ్ల వెంకటేశం, ఎడ్ల సైదులు, నర్రా శేఖర్‌రెడ్డి, నలపరాజు వెంకన్న, గాదె వెంకట్‌రెడ్డి, చింతల విజయ్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు.
ఉద్యోగులపై సస్పెన్షన్ ఎత్తివేయాలి


