అవినీతి నిర్మూలన ప్రతి ఒక్కరి బాధ్యత
రామగిరి(నల్లగొండ) : అవినీతి నిర్మూలన ప్రతి ఒక్కరి బాధ్యత అని అవినీతి నిరోధక శాఖ ఇన్‌స్పెక్టర్లు బి.వెంకట్రావు, కిషన్ అన్నారు. అంతర్జాతీయ అవినీతి నిరోధక దినోత్సవం సందర్భంగా స్థానిక ఎన్జీ కాలేజీలో ఎన్‌ఎస్‌ఎస్, ఎన్‌సీసీ ఆధ్వర్యంలో విద్యార్థులకు మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అవినీతిని పారద్రోలేందుకు కంకనబద్దులు కావాలని కోరారు. అవినీతికి తావు లేకుండా చూడాలని వీలైతే తమ శాఖ ఫోన్‌నంబర్‌కు 1064 సమాచారం అందించాలని కోరారు. అనంతరం పోస్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎన్జీ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.ఉపేందర్, చిలుముల సుధాకర్, ఏ.మల్లేశం, వెంకట్‌రెడ్డి, సావిత్రి, శివరాణి, అనిల్‌కుమార్ పాల్గొన్నారు.


