పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్
నల్లగొండ : మొదటి విడత పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్న పోలింగ్ కేంద్రాల్లో విధులు నిర్వహించే సిబ్బంది మూడవ విడత ర్యాండమైజేషన్‌ను మంగళవారం కలెక్టర్ ఛాంబర్‌లో చేపట్టారు. ఈ సందర్భంగా పంచాయతీ ఎన్నికల జిల్లా సాధారణ పరిశీలకురాలు కొర్రా లక్ష్మి, కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ చండూరు, నల్లగొండ డివిజన్ల పరిధిలో ఈ నెల 11న జరగనున్న ఎన్నికలకు 2,870 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. 7,892 మంది విధులు నిర్వహించేలా రాండమైజేషన్ చేశామని వివరించారు. పీఓలు 3,444, ఓపీఓలు 4,448 మందిని ఈ ర్యాండమైజేషన్ ద్వారా పోలింగ్ కేంద్రాలకు కేటాయించామన్నారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ నారాయణ్ అమిత్, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య, జెడ్పీ సీఈఓ శ్రీనివాసరావు, నల్లగొండ ఆర్డీఓ వై.అశోక్‌రెడ్డి, కలెక్టర్ కార్యాలయ ఏఓ మోతీలాల్, ఈడీఎం దుర్గారావు, ఎన్‌ఐసీ అధికారులు ప్రేమ్ పాల్గొన్నారు.


