
దీపావళి వెలుగులు నింపాలి
● శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి
నల్లగొండ: నల్లగొండ జిల్లా ప్రజలకు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ దీపావళి పండుగ ప్రతిఒక్కరి జీవితంలో వెలుగును నింపాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ప్రజలంతా దీపావళిని ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.
నేడే దీపావళి పండుగ
రామగిరి(నల్లగొండ): దీపావళి పండుగను సోమవారమే జరుపుకోవాలని నిర్ణయించినట్లు అఖిల బ్రాహ్మణ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొల్లా వేణుగోపాలరావు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 20న నరకచతుర్ధశి నివాళులు, 21న ధనలక్ష్మి పూజలు జరుపుకోవాలని ఆయన అన్నారు. అమావాస్య ఘడియలు సోమవారం మధ్యాహ్నం 3.46 నుంచి మంగళవారం సాయంత్రం 5.56 నిమిషాల వరకు ఉన్నందున నోములు సోమవారం, మంగళవారం రెండు రోజులు జరుపుకోవచ్చని సూచించారు. ఈసారి కొత్త నోములు లేవని పాత వారు కేదారిశ్వరి వ్రతం చేసుకోవాలన్నారు. సోమవారం నివాళులు ఇచ్చుకోవాలని పేర్కొన్నారు.
ఆకట్టుకున్న నృత్య ప్రదర్శన
భువనగిరి: భువనగిరి మండలం రాయగిరి గ్రామ పరిధిలోగల మినీ శిల్పారామంలో ఆదివారం శ్రీచంద్ర కళా నిలయం ఆధ్వర్యంలో పెరుమాండ్ల షంతోష్ శిష్య బృందం ఆంధ్ర నాట్య కళా ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. సెలవు దినం కావడంతో శిల్పారామానికి వచ్చిన సందర్శకులు నృత్య ప్రదర్శనను తిలకించి ఆనందించారు. ఈ నృత్య ప్రదర్శనలో కళాకారులు వష్తిక, సుహని, రితిక, నిత్యశ్రీ, అశ్రిత, దీక్షిత, అక్షిత పాల్గొన్నారు.

దీపావళి వెలుగులు నింపాలి

దీపావళి వెలుగులు నింపాలి