
5 ఫీట్లు పెరిగిందని బిల్లు ఇవ్వలే
మాకు ఖాళీ ప్లాటు ఉండడంతో ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేశారు. అధికారులు వచ్చిచూసి ముగ్గు పోశారు. బేస్‌మెంట్ వరకు కట్టుకున్నం. ఇప్పుడు మళ్లీ వచ్చి చూసి 5 ఫీట్లు ఎక్కువైంది, దాన్ని తీసేసి మళ్లీ కట్టాలని చెప్పారు. ఏమి చేయాలో అర్థం కావడం లేదు. బిల్లు కూడా మంజూరు చేయలే. ఇందిరమ్మ ఇల్లు మంజూరైందని ఎంతో ఆశగా కట్టడం మొదలు పెట్టినం. కానీ నిబంధనల పేరుతో అధికారులు కిరికిరీ పెడుతున్నరు.
–దోమలపల్లి మహేశ్వరి,
నర్సింగ్‌భట్ల, నల్లగొండ మండలం