
నీటిని తరలిస్తున్నా మంత్రి నోరుమెదపట్లే..
మిర్యాలగూడ : నల్లగొండ జిల్లాలోని చెరువులు, కుంటలను నింపకుండా సాగర్ నీటిని ఖమ్మం జిల్లా పాలేరు రిజర్వాయర్‌కు తరలించుకెళ్తున్నా.. జిల్లాకు చెందిన ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నోరుమెదపట్లేదని బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీందర్‌నాయక్ మండిపడ్డారు. సోమవారం మిర్యాలగూడలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎంసీ.కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావుతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. నాగార్జునసాగర్‌కు వరదనీరు వస్తున్నా నీటిని విడుదల చేసి నల్లగొండ జిల్లాలోని చెరువులు, కుంటలను నింపడంలేదన్నారు. బీసీల హక్కుల కోసం పోరాడుతున్న ఎమ్మెల్సీ కవితపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న దుర్భాషలాడడం సరైందికాదని.. ఆయన వెంటనే క్షమాపణలు చెప్పాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందాలనే రేషన్‌కార్డుల పంపిణీకి ప్రజాధనాన్ని వృథా చేస్తూ సభలు, సమావేశాలు పెడుతున్నారన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి, రైతుబంధు సమితి జిల్లా మాజీ అధ్యక్షుడు చింతరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, అన్నభీమోజు నాగార్జునచారి, యడవెల్లి శ్రీనివాస్‌రెడ్డి, నారాయణరెడ్డి, చిట్టిబాబునాయక్, బాలాజీనాయక్, హాతీరాం, యూసుఫ్, మోసిన్‌అలీ, చిర్ర మల్లయ్యయాదవ్ పాల్గొన్నారు.
ఫ బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్