
గ్రీవెన్స్‌డే ఫిర్యాదులు పరిష్కరించాలి
నల్లగొండ : గ్రీవెన్స్‌డేలో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. సోమవారం గ్రీవెన్స్‌డే సందర్భంగా కలెక్టరేట్‌కు వచ్చిన బాధితుల నుంచి ఆమె అదనపు కలెక్టర్ శ్రీనివాస్, జిల్లా అధికారులతో కలిసి వినతులు స్వీకరించారు. భూ సమస్యలు, పెన్షన్లపైనే అధికంగా ఫిర్యాదులు వచ్చాయి. మధ్యాహ్నం వరకు వినతులు స్వీకరించిన కలెక్టర్.. ఆ తర్వాత అధికారులతో సమావేశమయ్యారు. గ్రీవెన్స్‌డేలో వచ్చిన ఫిర్యాదులకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.
మహిళను మందలించిన కలెక్టర్..
గ్రీవెన్స్‌లో దరఖాస్తు చేసేందుకు ఓ మహిళ అక్కడి అధికారికి వినతిపత్రం సమర్పించిన సందర్భంలో.. సదరు అధికారులతో దురుసుగా మాల్లాడింది. దాంతో కలెక్టర్ జోక్యం చేసుకుని గ్రీవెన్స్ నిర్వహించేది ప్రజల సమస్యలు పరిష్కరించడానికేనని.. సమస్య ఉంటే విన్నవించాలని, బెదిరింపు దోరణి సరికాదని ఆ మహిళను కలెక్టర్ మందలించారు.
ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి