
స్వాతంత్య్ర సమరయోధురాలు రాధమ్మ మృతి
కోదాడరూరల్: కోదాడ పట్టణ పరిధిలోని కొమరబండ కేఎల్‌ఆర్ కాలనీలో నివాసముంటున్న స్వాతంత్య్ర సమరయోధురాలు జలగం రాధమ్మ(100) అనార్యోగంతో సోమవారం మృతిచెందింది. 1924లో సూర్యాపేట వద్ద గల నశీంపేటలో జన్మించిన ఆమె స్వాతంత్య్ర ఉద్యమంలో, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొంది. రజాకార్లతో జరిగిన పోరాటంలో అడవుల్లో తలదాచుకున్న యువతకు ఆమె కూలి అవతారమెత్తి ఆహారం అందించింది. అంతేకాకుండా 1952 మొదటి జనరల్ ఎలక్షన్ నుంచి 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల వరకు ప్రతి ఎన్నికలో ఆమె ఓటు హక్కు వినియోగించుకుని రికార్డు సృష్టించింది. ఆమెకు ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు సంతానం కాగా.. కోదాడ పట్టణ పరిధిలోని కొమరబండ కేఎల్‌ఆర్ కాలనీలో తన పెద్ద కుమారుడి ఇంట్లో మృతిచెందింది. రాధమ్మ మృతి పట్ల పలువురు నివాళులర్పించారు.
1952 నుంచి 2024 వరకు అన్ని జనరల్ ఎలక్షన్స్‌లో ఓటు వేసిన
రికార్డు ఆమె సొంతం