
ఆదర్శ టీచర్లు.. ప్రభుత్వ బడుల్లోనే పిల్లలు
పెన్‌పహాడ్ : మండలంలోని అనాజిపురం పీఎంశ్రీ ఆదర్శ పాఠశాల ఉపాధ్యాయులు తమ పిల్లలను అదే పాఠశాలలో చేర్చి ఆదర్శంగా నిలిచారు. పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు వావిలాల సూర్యగౌడ్ తన కుమార్తె ఆరాధ్యను ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో, కుమారుడు విరాట్ సూర్యను 9వ తరగతిలో చేర్పించారు. మరో టీచర్ ఎ. లింగయ్య తన కుమార్తె రసజ్ఞను 6వ తరగతిలో చేర్చారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ కోడి లింగయ్య మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు తమ పిల్లలను ఆదర్శ పాఠశాలలో చేర్పించడంతో ప్రైవేట్ పాఠశాలలకు పిల్లలను పంపే ఇతర తల్లిదండ్రులకు స్ఫూర్తినిస్తుందని అన్నారు.