
గూడ్స్‌రైలు కింద పడి మహిళ దుర్మరణం
మిర్యాలగూడ అర్బన్: గైడ్స్ రైలు కింద పడి గుర్తుతెలియని మహిళ మృతి చెందింది. ఈ ఘటన బుధవారం తెల్లవారుజామున మిర్యాలగూడ రైల్వే స్టేషన్ వద్ద జరిగింది. రైల్వే ఎస్‌ఐ బి. రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. సుమారు 45ఏళ్ల వయస్సున్న మహిళ మిర్యాలగూడ రైల్వే స్టేషన్ యార్డ్‌లో రైలు పట్టాలు దాటుతుండగా ప్లాట్‌ఫాం–2 వద్ద గూడ్స్ రైలు కింద పడి మృతిచెందింది. మృతురాలు నీలం రంగు జాకెట్, నారింజ రంగు చీర ధరించి ఉందని, 5.4 అంగుళాల ఎత్తు ఉంటుందని రైల్వే ఎస్‌ఐ తెలిపారు.
పాముకాటుతో..
బీబీనగర్: కూలీ పనికి వెళ్లిన మహిళకు పాముకాటుతో మృతి చెందింది. ఈ ఘటన బీబీనగర్ మండలం రహీమ్‌ఖాన్‌గూడెం గ్రామంలో బుధవారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. బీబీనగర్ మండలం రాయరావుపేట గ్రామానికి చెందిన గంగదారి ఉమ(50) భర్త గతంలోనే మృతిచెందడంతో ఆమె తన పుట్టిల్లు అయిన రహీమ్‌ఖాన్‌గూడెం గ్రామంలో తల్లిదండ్రుల వద్ద ఉంటూ జీవనం సాగిస్తోంది. ఉమ రోజుమాదరిగా బుధవారం కూలీ పనికి వెళ్లగా.. పని ప్రదేశంలో పాము కాటు వేయడంతో స్పృహ కోల్పోయి మృతిచెందింది.
తాటిచెట్టు పైనుంచి
కిందపడి గీత కార్మికుడు..
కేతేపల్లి: తాటిచెట్టు పైనుంచి కిందపడి గీత కార్మికుడు మృతి చెందాడు. ఈ ఘటన కేతేపల్లి మండలం చీకటిగూడెం గ్రామంలో బుధవారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. చీకటిగూడెం గ్రామానికి చెందిన గీత కార్మికుడు ఆల్దాసు జానయ్య(40) బుధవారం సాయంత్రం గ్రామంలో తాటిచెట్టు ఎక్కి కల్లు గీస్తుండగా.. ప్రమాదవశాత్తు కాలు జారి కిందిపడ్డాడు. అతడి నడుముకు ఉన్న ముస్తాదు, మోకు మెడ చుట్టూ బిగుసుకపోవడంతో ఊపిరాడక మృతి చెందాడు. మృతుడు జానయ్యకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. గ్రామస్తుల సమాచారం మేరకు కేతేపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నకిరేకల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
వ్యభిచార గృహాలపై
పోలీసుల దాడులు
కొండమల్లేపల్లి: దేవరకొండ పట్టణంలోని గణేష్‌నగర్‌లో వ్యభిచార గృహాలపై పోలీసులు బుధవారం దాడులు చేసి పది మందిని అదుపులోకి తీసుకున్నారు. అందులో ఇద్దరు మహిళలు, 8మంది పురుషులు ఉన్నట్లు సీఐ నరసింహులు తెలిపారు. వారిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
గుర్తుతెలియని వ్యక్తి మృతి
మిర్యాలగూడ అర్బన్: అనారోగ్యంతో బాధపడుతూ మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గుర్తుతెలియని వ్యక్తి బుధవారం మృతి చెందాడు. మృతుడి వివరాలు తెలిసిన వారు 87126 70150, 87125 77233 నంబర్లకు సమాచారం అందించాలని పోలీసులు సూచించారు.

గూడ్స్‌రైలు కింద పడి మహిళ దుర్మరణం