
చినుకు లేక.. మొలకెత్తక..
ఈయన పెద్దవూర మండలం గర్నెకుంటకు చెందిన చిట్టిమళ్ల సత్యం. ఈయన ఐదెకరాలు కౌలుకు తీసుకొని పత్తి వేశారు. అప్పటినుంచి సరైన వర్షం పడకపోవడంతో చాలా విత్తనాలు మొలకెత్తలేదు. మొలకెత్తినవి కూడా ఎండలకు ఎండిపోతున్నాయి. ఎకరాకు మూడు ప్యాకెట్ల చొప్పున ఐదెకరాలకు 15 ప్యాకెట్ల పత్తి గింజలు వేశాడు. వాటితోపాటు అరక, కూలీలు మొత్తంగా రూ.22 వేలు వెచ్చించాడు. వర్షాల్లేక ఇప్పుడు నష్టపోయే పరిస్థితి వచ్చిందని సదరు రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. జిల్లా అంతటా ఇదే పరిస్థితి నెలకొంది.
మళ్లీ అప్పులు చేయాల్సిన పరిస్థితి
నాకు ఎకరంన్నర పొలం ఉంది. గ్రామంలోని మరో రైతుకు చెందిన 11 ఎకరాలు కౌలుకు తీసుకున్నా. ఈనెల మొదట్లో వర్షాలు పడడంతో పత్తి విత్తనాలు నాటాను. ముందు మురిపించిన వాన తరువాత మొఖం చాటేసింది. దీంతో ఆ విత్తనాలు మొలకెత్తలేదు. ఇందుకోసం ఇప్పటికే రూ.2.30 లక్షలు అప్పు చేశాను. ఇప్పుడు మళ్లీ విత్తనాల పెట్టాలంటే మరో రూ.50 వెచ్చించాల్సిన పరిస్థితి వచ్చింది.
– జినుక సైదులు. ఆకారం, శాలిగౌరారం
పత్తి విత్తనాలు సగమే మొలకెత్తాయి
ఆరెకరాల్లో పత్తి విత్తనాలు పెట్టాం. అందులో సగమే మొలకెత్తాయి. మిగతా సగం భూమిలో తేమలేక మొలవలేదు. 15 రోజుల నుంచి వర్షం లేదు. దున్నడం నుంచి విత్తనాలు విత్తే వరకు ఎకరాకు రూ.15 వేల వరకు పెట్టుబడి పెట్టాం. మొలవని చోట్ల మళ్లీ విత్తనాలు పెట్టాల్సి వస్తుంది. ఈ ఏడాది పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు.
– ఐతగోని జంగమ్మ, రాంరెడ్డిపల్లి, మర్రిగూడ
ఫ పత్తి విత్తనాలు వేసిన రైతుల్లో ఆందోళన
ఫ చాలాచోట్ల మొలకె త్తని విత్తనాలు
ఫ మొలకెత్తిన చోట వాడుబడుతున్నయ్
ఫ కాపాడుకునేందుకు కర్షకుల పాట్లు

చినుకు లేక.. మొలకెత్తక..

చినుకు లేక.. మొలకెత్తక..

చినుకు లేక.. మొలకెత్తక..

చినుకు లేక.. మొలకెత్తక..