
రైతులకు విశిష్ట కార్డులు
నల్లగొండ అగ్రికల్చర్: కేంద్ర ప్రభుత్వం రైతులకు ఆధార్ తరహాలో విశిష్ట గుర్తింపు కార్డులు ఇచ్చేందుకు కార్యాచరణ సిద్ధం చేసంది. ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడంతో జిల్లాలో రైతుల పేర్లు నమోదు కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ సోమవారం ప్రారంభించింది. జిల్లావ్యాప్తంగా సుమారు రూ.5 లక్షల పైచిలుకు రైతులు ఉన్నట్టు ఇప్పటికే అధికారులు అంచనా వేశారు. ఈ గుర్తింపు కార్డే కేంద్ర ప్రభుత్వ పథకాలకు ప్రామాణికం కానుంది.
పదకొండు అంకెలతో కూడిన కార్డు జారీ
జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయంతోపాటు రైతు వేదికల్లో రైతుల పేర్లు నమోదు చేయనున్నారు. ఆధార్ సంఖ్యతో అనుసంధానమైన పట్టాదారు పాసుపుస్తకంలోని భూ యజమాన్య వివరాల వివరాల నమోదు ద్వారా రైతుకు 11 అంకెలు గల గుర్తింపు కార్డును కేటాయిస్తారు. రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం అందించే పథకాలైన పీఎం కిసాన్ పంటల బీమా, మౌలిక సదుపాయాల కల్పన తదితర పథకాలు అమలు చేస్తుంది. సరైన గణాంకాలు, ధ్రువీకరణ పత్రాలు, నమోదు వివరాలులేని కారణంగా రైతులకు సకాలంలో పథకాలు అందడం లేదని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం రైతులకు విశిష్ట గుర్తింపు కార్డులు ఇవ్వాలని నిర్ణయించి ఈ పథకాన్ని ప్రారంభించింది. జిల్లా వ్యాప్తంగా అగ్రిస్టాక్ తెలంగాణ ఫార్మర్ రిజిస్ట్రీ పేరుతో ఈ పథకాన్ని అమలు చేయనుంది. ఈ కార్డులు వచ్చిన రైతులకు కేంద్రం అమలు చేసే కిసాన్ బీమా పథకాలు వర్తిస్తాయి.
ఏఈఓలకు శిక్షణ పూర్తి
ఇప్పటికే మండల వ్యవసాయ విస్తరణ అధికారులకు ఈ కార్యక్రమంపై శిక్షణను ఇచ్చారు. విశిష్ట గుర్తింపు సంఖ్య నమోదుకు భూ యాజమాన్య పట్టాదార్ పాస్ పుస్తకం, ఆధార్ ఫోన్ నంబర్‌లతో మండల వ్యవసాయ అధికారి లేదా వ్యవసాయ విస్తరణాధికారి కార్యాలయాల వద్ద నమోదు చేసుకోవాలి. అనంతరం లబ్ధిదారుకు ఓటీపీ వస్తుంది. దాని ధ్రువీకరణ ద్వారా రైతుకు విశిష్ట గుర్తింపు సంఖ్యను కేటాయిస్తారు. ఈ సంఖ్యను కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుకు అనుసంధానం చేస్తారు. పీఎం కిసాన్‌లో తదుపరి విడత నిధులు విడుదలకు దీనినే ప్రామాణికంగా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది. జిల్లావ్యాప్తంగా అన్ని గ్రామాల్లోని రైతు వేదికల్లోనూ మండల వ్యవసాయ అధికారి వ్యవసాయ విస్తరణ అధికారుల పేర్ల నమోదు కార్యక్రమాన్ని మొదలుపెట్టారు.
ఫ కేంద్ర ప్రభుత్వ పథకాలు వర్తించేలా శ్రీకారం
ఫ 11 అంకెలతో జారీ చేయనున్న గుర్తింపు కార్డులు
ఫ పట్టాదారు పాస్‌బుక్, ఆధార్, సెల్ నంబర్‌కు లింకు
ఫ రైతుల పేర్ల నమోదు ప్రారంభం
రాష్ట్ర పథకాలకు సంబంధం లేదు
రాష్ట్రంలో అమలయ్యే రైతు భరోసా, రుణమాఫీ పథకాలకు రైతు విశిష్ట కార్డులకు ఎలాంటి సంబంధం ఉండదు. ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదుకు రెవెన్యూ శాఖ వద్ద ఉన్న భూ యజమాని వివరాలే ప్రామాణికంగా ఉంటాయి. విశిష్ట కార్డు కోసం రైతులు విధిగా పేర్లు నమోదు చేసుకుని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
– పాల్వాయి శ్రవణ్‌కుమార్, డీఏఓ, నల్లగొండ

రైతులకు విశిష్ట కార్డులు