మద్యపానం.. బహిరంగం! | - | Sakshi
Sakshi News home page

మద్యపానం.. బహిరంగం!

May 5 2025 9:06 AM | Updated on May 5 2025 9:06 AM

మద్యప

మద్యపానం.. బహిరంగం!

పోలీస్‌ పెట్రోలింగ్‌ పెంచాలి

జిల్లా కేంద్రంలో రాత్రి 9 గంటలు తాటిందంటే వైన్స్‌ వద్ద బహిరంగంగా కొందరు మద్యం తాగుతూ రోడ్డు మీద వచ్చిపోయే వారిపై తూలుతున్నా వారిని ఎవరూ ఏమీ అనే పరిస్థితి లేకుండా పోయింది. ఎన్జీ కాలేజీ మైదానంతోపాటు పట్టణంలో ఉన్న పార్కుల్లోనూ రాత్రిపూట మద్యం సేవిస్తున్న పరిస్థితి. పోలీసులు ఒక పక్క మద్యం సేవించి వాహనాలు నడిపేవారిపై కేసులు నమోదు చేస్తున్నా.. మెయిన్‌రోడ్డు మీద ఉన్న వైన్స్‌ సిట్టింగ్‌ల వద్ద మందుబాబులను కంట్రోల్‌ చేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. వైన్స్‌ల వద్ద సిట్టింగ్‌ల సమీపంలో, బహిరంగ ప్రదేశాలతోపాటు పార్కుల్లో కూడా పోలీస్‌ పెట్రోలింగ్‌ నిర్వహించి మందుబాబుల బెడద నుంచి రక్షణ కల్పించాలని పట్టణ వాసులు అంటున్నారు.

వైన్స్‌ల ముందు రోడ్లమీదే తాగుతున్న మందుబాబులు

నల్లగొండ: జిల్లాలో మందుబాబుల ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తూ వీరంగం సృష్టిస్తున్నారు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పోలీసులు నామమాత్రంగా కేసులు నమోదు చేస్తుండడం తప్ప మందుబాబుల ఆగడాలకు అడ్డుకట్ట వేయలేని పరిస్థితి. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ప్రతిరోజూ పోలీస్‌ పెట్రోలింగ్‌ లేకపోవడం వల్ల వైన్స్‌లు ఉన్న ప్రాంతాల్లో మందుబాబులు రోడ్ల మీదనే మద్యపానం చేసేస్తున్నారు. వైన్స్‌లకు చెందని పర్మిట్‌ రూమ్‌లు బార్లను తలపించేలా కనిపిస్తున్నాయి. దీంతో ప్రజలు ఆయా చోట్ల రోడ్ల మీదకు రావాలంటే జంకుతున్నారు. పట్టణ శివారు ప్రాంతాలతోపాటు పార్కుల్లోనూ రాత్రివేళల్లో మద్యం సేవించి అక్కడే బాటిళ్లు పడేస్తున్నారు. ఫలితంగా ఉదయం పాదచారులకు, వాకింగ్‌కు వచ్చే వారికి ఇబ్బందులు తప్పడం లేదు. బహిరంగ ప్రదేశాల్లో మద్యపానంపై ‘సాక్షి’ విజిట్‌లో ఈ వాస్తవాలు వెలుగుచూశాయి.

రాత్రయిందంటే హల్‌చల్‌

రాత్రయిందంటే చాలు కొందరు మందుబాబులు హల్‌చల్‌ సృష్టిస్తున్నారు. పట్టణాల్లో మద్యం కొనుగోలు చేసి శివారు ప్రాంతాల్లోకి వెళ్లి అక్కడ రోడ్ల వెంట, చెట్ల వెంట కూర్చుని మద్యం సేవిస్తున్నారు. ముఖ్యంగా వైన్స్‌లు పట్టణంలోని ప్రధాన రోడ్లలోనే ఉన్నాయి. అన్నింటికి సిట్టింగ్‌ రూమ్‌ల పర్మిషన్‌ కూడా ఉంది. కానీ సిట్టింగ్‌లన్నీ బార్లను తలపించేలా నిండిపోతున్నాయి. ఈ క్రమంలో కొందరు వాటిల్లో కూర్చోకుండా ప్రధాన రోడ్ల మీదకు వచ్చి బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగుతున్నారు. మరికొన్ని చోట్ల రాత్రి 8 అయితే వైన్స్‌ల వద్ద ఉన్న రోడ్లపైనే నిలబడే మద్యం తాగేస్తున్నారు. ప్రధానంగా హైదరాబాద్‌ రోడ్డులోని ఒక వైన్స్‌లో సిట్టింగ్‌ ఉన్నప్పటికీ రాత్రి 9 గంటల తర్వాత రోడ్డు మీదకు వచ్చి బహిరంగంగా మద్యం తాగుతున్నారు. హైదరాబాద్‌ రోడ్డులో ఉన్న మరో 2 వైన్స్‌ల వద్ద కూడా ఇదే పరిస్థితి నెలకొంది. అయితే ఇళ్ల మధ్య వైన్స్‌లు, సిట్టింగ్‌లు ఉండడంతో ఆయా ప్రాంతాల్లోని ప్రజలు, మహిళలు రాత్రి పూట బయటకు వెళ్లడానికి భయపడుతున్నారు.

ఫ శివారు ప్రాంతాలు, పార్కులు, రోడ్లపై విచ్చలవిడిగా..

ఫ మద్యం మత్తులో కొందరి హల్‌చల్‌

ఫ ప్రజలకు తప్పని ఇబ్బందులు

మద్యపానం.. బహిరంగం! 1
1/2

మద్యపానం.. బహిరంగం!

మద్యపానం.. బహిరంగం! 2
2/2

మద్యపానం.. బహిరంగం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement