ధాన్యానికి మద్దతు ధర కల్పించడంలో విఫలం | - | Sakshi
Sakshi News home page

ధాన్యానికి మద్దతు ధర కల్పించడంలో విఫలం

May 4 2025 6:21 AM | Updated on May 4 2025 6:21 AM

ధాన్యానికి మద్దతు ధర కల్పించడంలో విఫలం

ధాన్యానికి మద్దతు ధర కల్పించడంలో విఫలం

నల్లగొండ టూటౌన్‌ : రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మెదక్‌ ఎంపీ రఘునందన్‌రావు అన్నారు. శనివారం నల్లగొండలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఇద్దరు సీనియర్‌ మంత్రులు ఉండి ఏ ఒక్క రోజు కూడా కొనుగోలు కేంద్రాలను సందర్శించలేదన్నారు. కుల గణన చేస్తామని ప్రధాని మోదీ ప్రకటిస్తే తెలంగాణను మోడల్‌గా తీసుకోవాలని కాంగ్రెస్‌ నాయకులు మాట్లాడటం సిగ్గు చేటన్నారు. ఎన్నికల సమయంలోనే మంత్రి వెంకట్‌రెడ్డికి ఎస్‌ఎల్‌బీసీ గుర్తుకు వస్తుందన్నారు. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో చనిపోయిన వారి మృతదేహాలను వెలికితీయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు.

దేశాభివృద్ధిలో వాజ్‌పేయ్‌ పాత్ర కీలకం

దేశాభివృద్ధిలో దివంగత మాజీ ప్రధాని వాజ్‌పేయ్‌ కీలక పాత్ర పోషించారని ఎంపీ రఘునందన్‌రావు అన్నారు. వాజ్‌పేయ్‌ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా శనివారం నల్లగొండలోని బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీ మాట్లాడారు. అనంతరం వాజ్‌పేయిని కలిసిన జిల్లాకు చెందిన వ్యక్తులను ఘనంగా సన్మానించారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్‌రెడ్డి, సీనియర్‌ నేతలు చింతా సాంబమూర్తి, గోలి మధుసూదన్‌రెడ్డి, వీరెల్లి చంద్రశేఖర్‌, పిల్లి రామరాజుయాదవ్‌, వీరారెడ్డి, సాదినేని శ్రీనివాసరావు, పోతేపాక లింగస్వామి, వీరారెడ్డి, భాగ్యమ్మ, గడ్డం మహేష్‌, కాశమ్మ, రవి, తదితరులు పాల్గొన్నారు.

ఫ మెదక్‌ ఎంపీ రఘునందన్‌రావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement